STOCKS

News


కోలుకున్న రూపాయి

Friday 14th September 2018
Markets_main1536899294.png-20246

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి శుక్రవారం బలపడింది. ఆగస్ట్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యానికి దిగువునే నమోదు కావడం సానుకూల ప్రభావం చూపింది. ద్రవ్యోల్బణం 3.69 శాతంగా నమోదయ్యింది. ఇది పది నెలల కనిష్ట స్థాయి. దీంతో ఆర్‌బీఐ అక్టోబర్‌ 5న జరగనున్న తన తదుపరి పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించవచ్చనే అంచనాలున్నాయి.  

ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన బుధవారం ముగింపు 72.19తో పోలిస్తే 0.65 శాతం లాభపడింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం 71.70 వద్ద ప్రారంభమైంది. గణేష్‌ చతుర్థి కారణంగా గురువారం ఫారెక్స్‌ మార్కెట్‌కు సెలవు.
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.081 శాతంగా ఉంది. ఇక బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 8.134 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. 
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 10.9 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 731.1 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 6.37 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ శుక్రవారం 222 పాయింట్ల లాభంతో 37,939 వద్ద ప్రారంభమైంది. జనవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ 10.75 శాతం మేర లాభపడింది.  
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా ఒన్‌ 0.21 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.06 శాతం, మలేసియా రింగిట్‌ 0.06 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.06 శాతం, థాయ్‌ బట్‌ 0.06 శాతం, ఇండోనేసియ రుపియ 0.05 శాతం పెరిగాయి. అయితే చైనా ఆఫ్‌షోర్‌ 0.05 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.05 శాతం క్షీణించాయి. 
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 94.518తో పోలిస్తే 0.01 శాతం క్షీణతతో 94.522 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

శుక్రవారం వార్తల్లో షేర్లు..!

Friday 14th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  ఈ నెల 18 నుంచి షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించనుంది. వచ్చే నెల 3న ముగిసే ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేర్‌ను రూ.1,100కు కొనుగోలు చేస్తారు. మొత్తం 3.64 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.4,000 కోట్లని సంస్థ తెలిపింది. అలహాబాద్‌ బ్యాంక్‌:- సుమారు రూ.1900

గ్యాప్‌అప్‌తో స్టార్ట్‌..

Friday 14th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,717 పాయింట్లతో పోలిస్తే 222 పాయింట్ల లాభంతో 37,939 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,369 పాయింట్లతో పోలిస్తే 74 పాయింట్ల లాభంతో 11,443 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లో ట్రేడవుతుండటం, పారిశ్రామికోత్పత్తి జూలైలో 6.6 శాతంగా

Most from this category