STOCKS

News


72.50 దిశగా రూపీ పతనం

Monday 10th September 2018
Markets_main1536553685.png-20106

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి 72.50 దిశగా పతనమౌతోంది. సోమవారం నెగటివ్‌గా ప్రారంభమైన రూపాయికి పోనుపోను మరింత నష్టపోయింది. ఇంట్రాడేలో ఉదయం 10:35 సమయంలో 72.41 ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి పతమైంది. డాలర్‌కు బలమైన డిమాండ్‌, అధిక క్రూడ్‌ ధరల కారణంగా కరెంట్‌ అకౌంట్‌ లోటు నాలుగు త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరుకోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.16 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 71.74తో పోలిస్తే 0.58 శాతం బలహీన పడింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి సోమవారం 72.11 వద్ద ప్రారంభమైంది.  
ఇండియా కరెంట్‌ అకౌంట్‌ లోటు ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో నాలుగు త్రైమాసిక గరిష్ట స్థాయి 2.4 శాతానికి పెరిగింది. 2017-18 జనవరి-మార్చి త్రైమాసికంలో క్యాడ్‌ 1.9 శాతంగా ఉండేది. 
చైనా దిగుమతులపై అమెరికా అదనపు టారిఫ్‌ భయాలు సహా అమెరికా జాబ్‌ డేటా బాగుండటంతో డాలర్‌ బలపడటం, వర్ధమాన కరెన్సీలు పడిపోవడం కూడా రూపాయి క్షీణతకు కారణంగా చెప్పుకోవచ్చు.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.074 శాతంగా ఉంది. ఇక బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 8.029 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. 
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 11.5 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 424.8 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 6.25 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా ఒన్‌ 0.4 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.25 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.23 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.17 శాతం, ఇండోనేసియా రుపియ 0.11 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.08 శాతం క్షీణించాయి. 
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 95.365తో పోలిస్తే 0.08 శాతం పెరుగుదలతో 95.437 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

1200 దిగువన పసిడి

Monday 10th September 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం 1200 డాలర్ల దిగువున ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియా మార్కెట్లో భారతవర్తమాన కాలం గం.10:15ని.లకు ఔన్స్‌ పసిడి 2.20 డాలర్లు నష్టపోయి రూ.1,197.90 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  చైనా-అమెరికా దేశాల మధ్య వీడని వాణిజ్య యుద్ధ భయాలు, అమెరికాలో ఆగస్ట్‌లో అంచనాలకు మించి ఉద్యోగ కల్పన జరగడంతో డాలర్‌ బలపడింది. నేడు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌  95.44 వద్ద

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 10th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు యాక్సి్స్‌ బ్యాంక్‌:- కొత్త ఎండీ&సీఈవోగా అమితాబ్‌ చౌదరి నియమాకం ఖరారైంది. జనవరి 1న నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌:- కొత్త ఎండీ&సీఈవో నియమాకంపై సెప్టెంబర్‌ 12న జరిగే బోర్డు సమావేశంలో చర్చించనుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌:- సంస్థ స్వతంత్య్ర డైరెక్టర్‌గా శరత్‌ శర్మ నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. సోరెల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- వ్యాపార విస్తరణ, భవిష్యత్‌ వ్యాపార ప్రణాళికల అమలు కొరకు అవసరమయ్యే

Most from this category