STOCKS

News


మెరిసిన డాలర్‌.. పెరిగిన క్రూడ్‌!

Tuesday 9th April 2019
Markets_main1554793288.png-25027

- రూపాయికి 44 పైసలు నష్టం
- 69.67 వద్ద ముగింపు

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 44 పైసలు పడింది. దీనితో 69.67కు రూపాయి జారింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌, అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ పటిష్ట ధోరణి, పెరుగుతున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తాజాగా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉండడం కూడా రూపాయిపై ప్రభావం చూపింది.  రూపాయి వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్ల నుంచీ కిందకు జారుతోంది. ఈ కాలంలో 126పైసలు పడింది. రూపాయి ట్రేడింగ్‌ 69.40 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 69.71 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72-70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమయ్యింది. మరింత బలపడి గత నెల రోజులుగా 68-70  శ్రేణిలో తిరుగుతోంది. అయితే క్రూడ్‌ ధరల కత్తి ఇప్పటికీ రూపాయిపై వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వార్త రాసే సమయం రాత్రి 9.30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో నైమెక్స్‌ క్రూడ్‌ ధర 64 వద్ద ట్రేడవుతుండగా, భారత్‌ దిగుమతి చేసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ 71 వద్ద ట్రేడవుతోంది. ఈ రేట్లు ఐదు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం.  డాలర్‌ ఇండెక్స్‌ 96.66 వద్ద ట్రేడవుతుండగా, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 69.59 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

రూ.22,000 కోట్లకు డయాగ్నోస్టిక్‌ సేవల మార్కెట్‌

Tuesday 9th April 2019

వ్యవస్థీకృత రంగంలోనే అధిక వృద్ధి రేటు పెద్ద ల్యాబొరేటరీల్లో ఆధునిక టెక్నాలజీ విదేశీ ఆసుపత్రులకు భారత్‌ నుంచి సేవలు మారుతున్న జీవనశైలితో కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మనిషినిబట్టి చికిత్స మారుతోంది. దీంతో వైద్య సేవల రంగంలో ఇప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలదే కీలకపాత్ర అయింది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు (డయాగ్నోస్టిక్‌ సెంటర్లు) ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఆసుపత్రుల అవసరాలకు తగ్గట్టుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఇవి నూతన టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నాయి.

ఇక షేర్లన్నీ డీమ్యాట్‌లోనే..!!

Tuesday 9th April 2019

ఇక షేర్లన్నీ డీమ్యాట్‌లోనే..!! లిస్టెడ్‌ కంపెనీల్లో ఇంకా భారీగానే ఫిజికల్‌ షేర్లు 98.6 శాతం కంపెనీల్లో ఈ రకమైన వాటాదారులు ఫిజికల్‌ రూపంలో వాటాలను బదిలీ చేసుకోవడం ఇక అసాధ్యం మరొకరికి బదిలీ చేసుకోవాలంటే డీమ్యాట్‌లోనే న్యూఢిల్లీ: కాగితం రూపంలో ఉన్న ఫిజికల్‌ షేర్ల పట్ల వాటాదారుల్లో ఇప్పటికీ మమకారం పోలేదు.! లిస్టెడ్‌ కంపెనీల్లో 98.6 శాతం కంపెనీలకు ఫిజికల్‌ షేర్‌ సర్టిఫికెట్‌ కలిగిన వాటాదారులు ఉన్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. డిజిటల్‌ రూపంలోకి షేర్లను మార్చుకునే

Most from this category