STOCKS

News


స్వల్పంగా తగ్గిన రూపీ

Wednesday 28th November 2018
Markets_main1543384862.png-22428

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం స్వల్పంగా నష్టపోయింది. ఉదయం 9:15 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.08 శాతం తగ్గుదలతో 70.85 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మంగళవారం ముగింపు స్థాయి 70.79గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.81 వద్ద ప్రారంభమైంది. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 5 బేసిస్‌ పాయింట్లకు పైగా తగ్గాయి. దీంతో ఈల్డ్స్‌ ఏడు నెలల కనిష్ట స్థాయికి క్షీణంచాయి. డిసెంబర్‌లో రూ.40,000 కోట్ల విలువైన బాం‍డ్లను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేస్తామని రిజర్వు బ్యాంక్‌ ప్రకటించడం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.678 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.732 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
క్రూడ్‌ ధరలు పడిపోవడంతో ద్రవ్యలోటు కట్టడి భయాలు తగ్గడం కూడా సానుకూల ప్రభావం చూపింది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2018 గరిష్ట స్థాయి నుంచి చూస్తే దాదాపు 30 శాతం క్షీణించింది. 
ఈ నెలలో రూపాయి ఇప్పటి దాకా 4.61 శాతం మేర లాభపడింది. 
బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 4.28 శాతం మేర పెరిగింది. ప్రస్తుత సంవత్సరం మొత్తంగా చూస్తే రూపాయి 9.77 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 5.03 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.58 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రసంగం కోసం వేచిచూస్తున్నారు. ఫెడ్‌ భవిష్యత్‌లో ఎన్ని సార్లు వడ్డీ రేట్లు పెంచనున్నదనే అంశంపై దృష్టి కేంద్రీకరించనున్నారు. అలాగే ట్రేడర్లు.. అమెరికా, చైనా అధ్యక్షుల సమావేశపు అంశాలను కూడా నిశితంగా గమనిస్తున్నారు. దక్షిణ కొరియా ఒన్‌ 0.15 శాతం, థాయ్‌ బట్‌ 0.04 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.04 శాతం పెరిగాయి. ఇక మలేసియా రింగిట్‌ 0.17 శాతం, ఇండోనేసియా రుపియ 0.08 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.07 శాతం క్షీణించాయి. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 97.369తో పోలిస్తే ఫ్లాట్‌గా అక్కడే ట్రేడవుతోంది. 



You may be interested

కేంద్రం- ఆర్‌బీఐ మధ్య మళ్లీ ఉద్రిక్తత?

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: రుణ మంజూరీపై నియంత్రణలు ఎదుర్కొంటున్న 11 బ్యాంకుల్లో కొన్నింటిని ఆ ఆంక్షల పరిధి నుంచి తప్పించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)పై కేంద్రం ఒత్తిడి తేనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే వాటి నిర్వహణ నిబంధనలను కూడా సమీక్షించాలని కోరనుంది. డిసెంబర్‌ 14న 18 మంది సభ్యుల బోర్డ్‌ సమావేశాల్లో ఈ  అంశంపై చర్చ జరగనుందని ఆ వర్గాలు వెల్లడించాయి. దీనితో ఈ సమావేశాల సందర్భంగా  కేంద్రం-ఆర్‌బీఐ

యస్ బ్యాంక్ 4 శాతం డౌన్‌

Wednesday 28th November 2018

ముంబై: ప్రైవేట్ రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ షేరు ధర బుధవారం ట్రేడింగ్‌లో 4 శాతానికి మించి నష్టాలను నమోదుచేసింది. ఉదయం 10 గంటల సమయానికి రూ.8 (4.5 శాతం) నష్టపోయి రూ.175 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.173.50 వద్దకు పడిపోయింది. ఈ షేరు 52 వారాల కనిష్టస్థాయి రూ.165.00 (28, సెప్టెంబర్‌ 2018)వద్ద ఉంది. డైరెక్టర్ల వరుస రాజీనామాల నేపథ్యంలో వరుస పతనాన్ని నమోదుచేసింది. ఇక తాజా రేటింగ్‌

Most from this category