STOCKS

News


రూపాయి డౌన్‌

Monday 3rd December 2018
Markets_main1543812496.png-22579

  • డాలరుతో 70.08 వద్ద ప్రారంభం

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభ సమయంలో 50 పైసలు బలహీనపడింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో 70.08 దగ్గర ప్రారంభమయ్యింది. దిగుమతిదారులు, బ్యాంకర్ల నుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరిగి డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణించిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. గతకొంత కాలంగా నష్టపోతూ వచ్చిన ముడిచమురు ధరలు ఇవాళ స్వల్పంగా బలపడడం, శుక్రవారం ఒక్కరోజులోనే విదేశీ ఇన్వెస్టర్లు రూ.333 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం లాంటి ప్రధాన అంశాలు ఇందుకు కారణంగా చెప్పారు.  అయితే, దేశీయ స్టాక్‌ సూచీలు లాభాల్లో ప్రారంభం కావడం వల్ల మరింత నష్టపోకుండా నిలిచిందని వివరించారు. ఇక శుక్రవారం నాటి ఫారెక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి డాలరుతో రూపాయి విలువ 27 పైసలు బలపడి 69.58 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో రూపాయి విలువ 9.7 శాతం పతనమైంది. 



You may be interested

పసిడి లాభాల బాట

Monday 3rd December 2018

అమెరికా - చైనా దేశాల మధ్య కుదిరిన వాణిజ్యయుద్ధ సంధితో సోమవారం పసిడి ధర లాభాల బాట పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:0లకు ఔన్స్‌ పసిడి ధర 4.60డాలర్లు పెరిగి రూ.1230.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. జీ-20 సదస్సులో గత కొంతకాలంగా  అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంపై దేశాధినేతలు చర్చలు జరిపారు. దాగాపు గంటన్నరపాటు జరిగిన ఈ చర్చల్లో ఇరుదేశాలు తాత్కాలికంగా వాణిజ్యయుద్ధానికి

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 3rd December 2018

గతవారం లాభాల ముగింపు కొనసాగిస్తూనే సోమవారం మార్కెట్‌ భారీ లాభాలతో ప్రారంభమైంది. జీ –20 సదస్సు సందర్భంగా వాణిజ్య యుద్ధంపై అమెరికా, చైనాల మధ్య ఎట్టకేలకు సంధి కుదిరింది. ఫలితంగా నేడు ఆసియామార్కెట్లు భారీ లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల వాతావారణాన్ని అందుకున్న ప్రధాన సూచీలైన నిఫ్టీ 10,900పైన, సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 234 లాభంతో 36429.07 వద్ద, నిఫ్టీ

Most from this category