STOCKS

News


8 నెలల కనిష్ఠానికి రూపీ

Friday 23rd August 2019
Markets_main1566534467.png-27961

దేశియ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో, గత ఏడాది డిసెంబర్‌ తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి శుక్రవారం చేరుకుంది. రూపీ డాలర్‌ మారకంలో 10 పైసలు బలహీనపడి 71.91 ప్రారంభమవ్వగా, కొద్ది నిముషాల్లోనే 72.05 స్థాయిని తాకింది. ఈక్విటీ మార్కెట్‌ భారీగా పడిపోవడంతో పాటు విదేశి నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగుతుండడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 26 పైసలు బలహీనపడి 71.81 వద్ద ముగిసింది. కాగా రూపీ డాలర్‌ మారకంలో ఆరేళ్లలో అత్యధిక నెల వారి పతనాన్ని నమోదు చేసింది. ఈ నెలలో 4.6 శాతం విలువను కొల్పోయిన రూపీ, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3.1 శాతం విలువను కొల్పోవడం గమనార్హం. వీటితోపాటు చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను తగ్గించడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు అనిశ్చితిలో ఉన్నాయని ఫారెక్స్‌ ట్రేడర్స్‌ తెలిపారు. 
ఉదయం 9.37 సమయానికి రూపీ డాలర్‌ మారకంలో  71.99 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

2వారాల కనిష్టం వద్ద పసిడి

Friday 23rd August 2019

ప్రపంచమార్కెట్లో శుక్రవారం పసిడి ధర 2వారాల కనిష్టస్థాయి దిగువను ట్రేడ్‌ అవుతోంది. బాండ్‌ ఈల్డ్‌ బలపడటంతో పసిడి ధరపై ఒత్తిడి పెరుగుతోంది. ఫెడ్‌రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ నేటిరాత్రి జాక్సన్‌ హోల్‌ సదస్సు ప్రసంగించనున్న నేపథ్యంలో బాండ్‌ ఈల్డ్‌ బలపడుతోంది. ఆసియా ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర నిన్నటి ముగింపు(1,503.85 డాలర్లు)తో పోలిస్తే 5డాలర్లు నష్టపోయి 1,503.55 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల వెలువడిన జూలై ఫెడ్‌

బ్యాంక్‌ నిఫ్టీ 1.5 శాతం పతనం

Friday 23rd August 2019

నిన్నటి ట్రేడింగ్‌లో రెండువారాల కనిష్టానికి పతనమైన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1.50శాతం క్షీణించింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల భారీ క్షీణిత ఇందుకు కారణమవుతోంది. నేడు నిఫ్టీ ఇండెక్స్‌ 26,835.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలోనే ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లైన ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు 3శాతం మేర నష్టపోవడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఒకదశలో

Most from this category