STOCKS

News


రూపీ డౌన్‌

Monday 10th December 2018
Markets_main1544414881.png-22783

ఇండియన్‌ రూపాయి సోమవారం నష్టాల్లో ప్రారంభమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 54 పైసల క్షీణతతో 71.34 వద్ద ట్రేడవుతోంది. క్రూడ్‌ ధరల పెరుగుదల, ఎన్నికల ఫలితాలు వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి శుక్రవారం ముగింపు స్థాయి 70.80గా ఉంది. ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపాయి డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ గత సెషన్‌లో 70.90 వద్ద ఉంది. డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ గత సెషన్‌లో 0.42 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది. అమెరికా డాలర్‌- ఇండియన్‌ రూపాయి మారక విలువ దిగువ స్థాయిల్లో మద్దతు లభించొచ్చని పేర్కొంది. అందువల్ల దిగువ స్థాయిలను ఉపయోగించుకొని లాంగ్‌ పొజిషన్లను తీసుకోవచ్చని సిఫార్సు చేసింది. ఇకపోతే ఒపెక్‌ దేశాల ఆయిల్‌ సరఫరా తగ్గింపు నిర్ణయంతో క్రూడ్‌ ధరలు సోమవారం పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 62.15 డాలర్ల వద్ద ఉంది. మంగళవారం వెలువడన్ను ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికార పార్టీకి మిశ్రమ ఫలితాలు ఉండొచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొంటున్నాయి. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 10th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు యాక్సిస్‌ బ్యాంక్‌:- బోర్డు అదనపు డైరెక్టర్‌గా అమితాబ్‌ చౌదరిని నియమించింది. అలాగే స్వతంత్ర డైరెక్టర్లుగా సమీర్‌, సోమ్‌ మిట్టల్‌, రోహిత్‌ భగత్‌లను పదవికాలాన్నీ మరో 8ఏళ్ల పాటు పెంచుతున్నట్లు బోర్డు ప్రకటించింది. అలెంబిక్‌ ఫార్మా:-  ఎన్‌సీడీ కమిటీ డిసెంబర్‌ 14వ తేదిన సమావేశం కానుంది. ఈ సమావేశంలో రూ.350 కోట్ల విలువైన అన్‌సెక్యూర్డ్‌ లిస్టెడ్‌ రీడమబుల్‌ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల(ఎన్‌సీడీ)ల జారీ కమిటీ ఆమోదం

మార్కెట్‌ క్రాష్‌

Monday 10th December 2018

సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌ 10,500 సమీపంలోకి నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,693 పాయింట్లతో పోలిస్తే 185 పాయింట్ల నష్టంతో 10,508 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,673 పాయింట్లతో పోలిస్తే 469 పాయింట్ల నష్టంతో 35,204 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సమయం పెరిగే కొద్ది ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:22

Most from this category