STOCKS

News


71 సమీపంలో రూపీ..

Thursday 6th December 2018
Markets_main1544074037.png-22679

ఇండియన్‌ రూపాయి గురువారం నష్టాల్లో ట్రేడవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 71 సమీపంలో కదలాడుతోంది. రూపాయి తన మునపటి ముగింపుతో (70.46)పోలిస్తే 50 పైసలు క్షీణతతో 70.96 వద్ద ఉంది. బుధవారం నాటి ఆర్‌బీఐ పాలసీ రేట్లు నిర్ణయం వెలువడక ముందు రూపాయి 70.30-70.80 రేంజ్‌లో కదలాడింది. ఆర్‌బీఐ తన పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎస్‌ఎల్‌ఆర్‌ను 25 బేసిస్‌ పాయిం‍ట్ల మేర తగ్గించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగపు ద్రవ్యోల్బణ అంచనాలను 2.7-3.2 శాతానికి తగ్గించింది. 
ఇండియన్‌ రూపాయి- అమెరికా డాలర్‌ మారక విలువ గురువారం 70.30-71.20 శ్రేణిలో కదలాడవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. 
మరోవైపు భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ గురువారం 3 బేసిస్‌ పాయింట్ల క్షీణతతో 8 నెలల కనిష్ట స్థాయికి తగ్గాయి. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా బాండ్ల కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తామని ఆర్‌బీఐ ప్రకటించడం ఇందుకు కారణం. 9:15 సమయంలో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.407 శాతం వద్ద ట్రేడవుతున్నాయి. ఏప్రిల్‌ 13 నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. ఇక బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.441 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, ధరలు పరస్పరం వ్యతిరేక దిశల్లో ఉంటాయి. 



You may be interested

సేవల రంగం జోరు..

Thursday 6th December 2018

న్యూఢిల్లీ: కొత్త వర్క్ ఆర్డర్లు, సానుకూల మార్కెట్ పరిస్థితుల ఊతంతో నవంబర్‌లో సేవల రంగం వృద్ధి వేగం పుంజుకుంది. నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ నవంబర్‌లో 53.7 పాయింట్లుగా నమోదైంది. దీంతో వరుసగా ఆరో నెల కూడా వృద్ధి నమోదైనట్లయింది. అక్టోబర్‌లో ఇది 52.2 పాయింట్లుగా ఉంది. పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) ప్రమాణాల ప్రకారం సూచీ 50 పాయింట్ల

గ్యాప్‌డౌన్‌ మార్కెట్‌

Thursday 6th December 2018

10,700 దిగువున నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,782 పాయింట్లతో పోలిస్తే 64 పాయింట్ల నష్టంతో 10,718 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 35,884 పాయింట్లతో పోలిస్తే 190 పాయింట్ల నష్టంతో 35,694 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం

Most from this category