STOCKS

News


రూపాయికి నష్టాలు

Thursday 4th April 2019
Markets_main1554365229.png-24970

గురువారం ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ నష్టాల్లోకి జారింది. ఆరంభమే బలహీనంగా 68.56 వద్ద ఓపెనై, క్రమంగా 68.66కు దిగజారింది. అనంతరం కొంత లాభపడి 68.62 వరకు వచ్చినా, ఆర్‌బీఐ ప్రకటనతో తిరిగి మరింత నష్టాల్లోకి జారింది. ఆర్‌బీఐ ఎంపీసీ తాజాగా రెపోరేట్‌ను మరో 25 బీపీఎస్‌ తగ్గించింది. ఈ ప్రకటనతో రూపీ విలువ మరింత పతనమై 68.98కిచేరింది. మధ్యాహ్న సమయానికి 68.97 వద్ద కదలాడుతోంది. బుధవారం ట్రేడింగ్‌లో రూపీ 33 పైసలు లాభపడింది. ఆర్‌బీఐ ప్రకటనతో పాటు, రుతుపవనాలు సాధారణం కన్నా తక్కువుంటాయన్న స్కైనెట్‌ అంచనాలు.. రూపీపై భారం పెంచాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువకావచ్చని ప్రైవేట్‌ సంస్థ స్కైనెట్‌ అంచనాలు వెల్లడించింది. ఈ రెండు కారణాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో వివిధ కరెన్సీ బాస్కెట్‌తో డాలర్‌ విలువ బలపడడం కూడా రూపీ పతనానికి పరోక్ష కారణమయింది. అయితే క్రూడాయిల్‌ ధరలు కాస్త దిగిరావడం రూపాయి మరింత పతనం కాకుండా అడ్డుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు సూచీలు ఆర్‌బీఐ ప్రకటన అనంతరం నష్టాల్లోకి జారి ప్రస్తుతం స్వల్పలాభాల్లోకి మరలాయి. 



You may be interested

ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తక్షణ గృహరుణం!

Thursday 4th April 2019

దేశంలో పెరిగిపోతున్న సరసమైన గృహనిర్మాణ కార్యక్రమానికి తగినట్లుగా ఐసీఐసీఐ బ్యాంకు సరికొత్త గృహరుణ ఆఫర్లను ప్రకటించింది. ఈ పథకాల కింద కస్టమర్లు తక్షణమే కొత్త గృహరుణాన్ని లేదా కొత్త టాప్‌అప్‌ లోన్‌ను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఈ ప్రాసెస్‌ మొత్తం డిజిటల్‌గానే పూర్తవుతుంది. ఈ పథకం కింద కొత్త ఇంటి కోసం కోటి రూపాయల వరకు రుణాన్ని అందిస్తారు. కస్టమర్‌ వయసును బట్టి గరిష్ఠంగా 30 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. ఈ

ఆర్‌బీఐ నిర్ణయంపై మార్కెట్‌ నెగిటివ్‌ స్పందన

Thursday 4th April 2019

గురువారం ఆరంభం నుంచి ఫ్లాట్‌గా ఉన్న సూచీలు ఆర్‌బీఐ ప్రకటన తర్వాత నష్టాల్లోకి జారాయి. గురువారం ఎంపీసీ సమావేశానంతరం రిజర్వుబ్యాంక్‌ రెపో రేటును మరో పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6 శాతానికి దిగివచ్చింది. ఈ నిర్ణయం మార్కెట్‌కు పెద్దగా రుచించినట్లు కనిపించడం లేదు. దీంతో నిఫ్టీ 11620 పాయింట్లకు దిగువన, సెన్సెక్స్‌ 38800 పాయింట్లకు దిగువన ట్రేడవుతున్నాయి.  ఒకదశలో నిఫ్టీ 11600

Most from this category