STOCKS

News


రూపీ డౌన్‌..

Friday 14th December 2018
Markets_main1544762063.png-22909

ఇండియన్‌ రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. ఉదయం 9:10 సమయంలో రూపాయి 71.79 వద్ద ఉంది. గురువారం ముగింపు స్థాయి 71.69తో పోలిస్తే 0.15 శాతం క్షీణించింది. ఇకపోతే శుక్రవారం రూపాయి 71.75 వద్ద ప్రారంభమైంది. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.409 శాతంగా ఉంది. ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 7.408 శాతం. బాండ్‌ ధరలు, ఈల్డ్‌ పరప్సరం వ్యతిరేక దిశలో ఉంటాయి. 

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 5.5 శాతం మేర లాభపడింది. అదే సమయంలో రూపాయి 11 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నంఉచి 4.6 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.48 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 

చైనా ఆర్థిక గణాంకాలు బలహీనంగా ఉండటం వల్ల ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ దాదాపు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇకపోతే ఫెడరల్‌ రిజర్వు సమావేశం వచ్చే వారంలో జరగనుంది. 

దక్షిణ కొరియా ఒన్‌ 0.54 శాతం, ఇండోనేసియా రుపియా 0.4 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.16 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.11 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.1 శాతం, మలేసియా రింగిట్‌ 0.07 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.06 శాతం నష్టపోయాయి. అయితే జపాన్‌ యెన్‌ 0.12 శాతం, హాంగ్‌ కాంగ్‌ డాలర్‌ 0.05 శాతం లాభపడ్డాయి. 

ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 97.064తో పోలిస్తే 0.06 శాతం పెరుగుదలతో 97.123 వద్ద ట్రేడవుతోంది.   



You may be interested

ప్రభుత్వానికి ఆర్‌బీఐ మద్దతివ్వాలి

Friday 14th December 2018

ముంబై: ఆర్‌బీఐని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వీర్యం చేయబోదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ ప్రభుత్వంలో ఒక భాగమని, అది ప్రభుత్వ ఆర్థిక విధానానికి మద్దతుగా నిలవాలని అభిప్రాయపడ్డారు. కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదాల వల్ల ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో మంత్రి గడ్కరీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉర్జిత్‌ పటేల్‌ స్థానంలో శక్తికాంత్‌ దాస్‌ ఆర్‌బీఐ

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 14th December 2018

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌:- బై బ్యాక్‌ ఇష్యూతో పాటు షేరు మధ్యంతరం డివిడెంట్ చెల్లింపునకు బోర్డు ఆమోదం తెలిపింది. బై బ్యాక్‌ ఇష్యూలో కంపెనీ ప్రతి షేరు ధర రూ.149లు చొప్పున మొత్తం 29.7 కోట్ల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.4,435 కోట్ల వ్యయాన్ని ఖర్చు పెట్టనుంది. బై బ్యాక్‌ ఇష్యూకు డిసెంబర్‌ 25ను రికార్డు

Most from this category