STOCKS

News


రూపీ డౌన్‌

Thursday 20th December 2018
Markets_main1545279463.png-23089

  • ఫెడ్‌ నిర్ణయం, ఆర్‌బీఐ మినిట్స్‌ ప్రభావం.. 

ఇండియన్‌ రూపాయి గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు రేట్ల పెంపు తర్వాత ఆసియా ప్రధాన కరెన్సీలు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. మరోవైపు బుధవారం విడుదలైన ఆర్‌బీఐ పాలసీ సమావేశ వివరాలు.. అధిక ద్రవ్యోల్బణ, వృద్ధి రేటు క్షీణతపై ఆందోళనలు రేకెత్తించడంతో సెంటిమెంట్‌ దెబ్బతింది. ఉదయం 9:15 సమయంలో రూపాయి 70.54 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు (బుధవారం) 70.40తో పోలిస్తే 0.19 శాతం నష్టపోయింది. 70.66 వద్ద ప్రారంభమైన రూపాయి. 70.53 గరిష్ట స్థాయిని, 70.68 కనిష్ట స్థాయిని తాకింది. 

భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.245 శాతం వద్ద ట్రేడవుతోంది. బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు (బుధవారం) 7.22 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్‌, ధరలు పరస్పరం వ్యతిరేక దిశల్లో ఉంటాయి. 

ఫెడరల్‌ రిజర్వు అంచనాలకు అనుగణంగానే వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో రేట్ల శ్రేణి 2.25- 2.5 శాతానికి చేరింది. 2019లో మూడు సార్లు కాకుండా రెండు సార్లు రేట్ల పెంపు ఉండొచ్చని పేర్కొంది. అయితే రేట్ల పెంపునకు ఎప్పుడు ముగింపు పలికే విషయమై స్పష్టత ఇవ్వకపోవడంతో మార్కెట్లు నిరుత్సాహానికి గురయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇకపోతే ఇండియన్‌ రూపాయి ఈ ఏడాది ఇప్పటి దాకా 9 శాతం మేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 4.44 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.34 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 



You may be interested

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 20th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఫైజర్‌:- బ్రిటన్‌కు చెందిన గ్లాస్కోస్మిత్‌లైన్‌ పీఎల్‌సీతో అమెరికాలోని తన మాతృసంస్థ ఫైజర్‌ ఇంక్‌ వ్యూహాత్మక ఒప్పందాన్ని కదుర్చుకుంది. ఇరు సంస్థల భాగస్వామ్యంలో  ప్రపంచస్థాయి కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. టీసీఎస్‌:- కెనడాలో నెక్ట్స్‌ జనరేషన్‌ క్లౌడ్‌ను ప్రారంభించింది. కెనరా బ్యాంక్‌:- బాసిల్‌-III బాం‍డ్ల జారీ ద్వారా రూ.3000 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను ఒకేసారి లేదా వివిధ దఫాలుగా సమీకరించవచ్చని కంపెనీ

మార్కెట్‌ స్పీడ్‌కు ఫెడ్‌ బ్రేకులు..

Thursday 20th December 2018

10,900 దిగువున నిఫ్టీ.. 80 పాయింట్లు డౌన్‌ సెన్సెక్స్‌ 160 పాయింట్లకు పైగా క్షీణత అమెరికా ఫెడరల్‌ రిజర్వు రేట్ల పెంపు కారణంగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గరువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,967 పాయింట్లతో పోలిస్తే 82 పాయింట్ల నష్టంతో 10,885 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,484 పాయింట్లతో పోలిస్తే 163 పాయింట్ల నష్టంతో 36,321 పాయింట్ల వద్ద

Most from this category