STOCKS

News


రూపీ రికవరీ

Wednesday 10th October 2018
Markets_main1539144278.png-20991

ఇండియన్‌ రూపాయి బుధవారం స్వల్పంగా కోలుకుంది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 74.22 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ముగింపు 74.39తో పోలిస్తే 0.22 శాతం లాభపడింది. రూపాయి బుధవారం 74.13 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 8.049 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 8.076 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 14 శాతంమేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 3.58 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.55 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది మొత్తంగా 1 శాతంమేర లాభపడింది. 
ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. థాయ్‌ బట్‌ 0.23 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.18 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.14 శాతం, మలేసియా రింగిట్‌ 0.12 శాతం, ఇండోనేసియా రుపయా 0.08 శాతం, చైనా రెన్‌మిన్‌బి 0.05 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.05 శాతం పెరిగాయి. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 95.668తో పోలిస్తే 0.1 శాతం క్షీణతతో 95.578 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 10th October 2018

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- అమెరికాలో మార్కెట్‌లో డయాబెటీస్‌ చికిత్సలో వినియోగించే కోలేసెవేలామ్‌ హెచ్‌సీఎల్‌ ఔషధాలను విడుదల చేసింది. ఈ ఔషధ వార్షిక మార్కెట్‌ విలువ రూ.34వేల కోట్లు ఉంటుంది. హెల్త్‌కేర్‌ గ్లోబల్స్‌:​- తన అనుబంధ సంస్థ ఇండియా మెడికల్‌ డయాగ్నస్టిక్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకునేందుకు క్వెస్ట్‌ డయాగ్నస్టిక్స్ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చకుంది. ఎన్‌సీఎల్‌ ఇండియా:- రూ.1249 కోట్ల షేర్ల బై బ్యాక్‌ ఇష్యూకు బోర్డు

లాభాల బోణి

Wednesday 10th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,299 పాయింట్లతో పోలిస్తే 194 పాయింట్ల లాభంతో 34,493 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,301 పాయింట్లతో పోలిస్తే 30 పాయింట్ల లాభంతో 10,331 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.   అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, నవంబర్‌లో ఎన్నికలు

Most from this category