STOCKS

News


ఆఫ్‌షోర్‌లో రూపీ డౌన్‌

Saturday 20th October 2018
Markets_main1540019126.png-21320

ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం రాత్రి పడిపోయింది. 73.48 స్థాయికి పతనమైంది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే సోమవారం రూపాయి నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. 
కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో గరిష్ట స్థాయిల నుంచి తగ్గిన క్రూడ్‌ ధర రూపాయి విలువకు కలిసివస్తోంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ శుక్రవారం 29 పైసలు బలపడింది. 73.32 వద్ద ముగిసింది. ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత 10,11,12 తేదీల్లో వరుసగా 18, 09, 55 పైసలు చొప్పున మొత్తం 82 పైసలు బలపడింది.  సోమవారం (15వ తేదీ) ట్రేడింగ్‌లో మాత్రం మళ్లీ 26 పైసలు పడిపోయింది. తిరిగి మంగళ, బుధ, శుక్రవారాల్లో (గురువారం ట్రేడింగ్‌ సెలవు) వరుసగా బలపడుతూ వస్తోంది. శుక్రవారం రూపాయి ట్రేడింగ్‌ 73.62 వద్ద ప్రారంభమైంది. అటు తర్వాత ఒకదశలో 73.31కి కూడా చేరింది. అంటే చరిత్రాత్మక గరిష్ట స్థాయిలను (74.39) చూసిన తర్వాత ఒకటి మినహా (సోమవారం) మిగిలిన ఆరు ట్రేడింగ్‌ సెషన్‌లలో రూపాయి (100 పైసలకు పైగా) రికవరీ అవుతూ వస్తున్న విషయం గమనార్హం. 



You may be interested

ఎంఫసిస్‌ కొనొచ్చు..

Saturday 20th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో ఒకసారి చూద్దాం..  బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఎంఫసిస్‌ రేటింగ్‌: కొనొచ్చు రంగం: ఐటీ ప్రస్తుత ధర: రూ.1,067 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,430 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఎంఫసిస్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. కంపెనీ క్యూ2 ఆర్థిక ఫలితాలు ఆకట్టుకున్నాయని తెలిపింది. ఆదాయం, నిర్వహణ పనితీరు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని పేర్కొంది. కంపెనీ నికర

వేదాంత ఏడీఆర్‌ 4% అప్‌..

Saturday 20th October 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ అన్నీ కూడా శుక్రవారం దాదాపుగా లాభాల్లోనే ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, విప్రో, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగింది. దీని తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్‌ బాగా లాభపడింది.  టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.42 శాతం వృద్ధితో 11.89 డాలర్లకు పెరిగింది.

Most from this category