STOCKS

News


స్వల్పంగా కోలుకున్న రూపాయి

Wednesday 19th September 2018
Markets_main1537329145.png-20369

క్రితం రోజు భారీగా నష్టపోయి 72.98 వద్ద ముగిసిన రూపాయి బుధవారం స్వల్పంగా కోలుకుంది. డాలరుతో రూపాయి మారకపు విలువ ట్రేడింగ్‌ ప్రారంభంలో 26 పైసలు రికవరీ అయ్యి, 72.72 వద్ద ట్రేడవుతోంది. డాలరు ఇండెక్స్‌ గత రాత్రి ముగింపుతో పోలిస్తే స్వల్పంగా 94.18 స్థాయికి తగ్గడం, పలు వర్థమాన కరెన్సీలు స్వల్పంగా బలపడిన నేపథ్యంలో రూపాయి కోలుకుంది. అలాగే ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ లాభాలతో ట్రేడ్‌కావడం, మన మార్కెట్‌ స్వల్ప గ్యాప్‌అప్‌తో ప్రారంభంకావడం కూడా స్థానిక కరెన్సీ పెరగడానికి కారణాలు. 


 



You may be interested

11300 పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 19th September 2018

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల వాతావరణాన్ని అందుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం లాభాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ గతముగింపు(37290)తో పోలిస్తే 143 లాభంతో 37433 వద్ద, నిఫ్టీ గత ముగింపు(11,279)తో పోలిస్తే 48 పాయింట్ల లాభంతో 11,326 వద్ద ప్రారంభమైంది. విప్రో, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, జీలిమిటెడ్‌, టైటాన్‌ షేర్లు అరశాతం  నుంచి 3శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతుండగా, టాటాస్టీల్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌పేయింట్స్‌​, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ షేర్లు 1నుంచి 2శాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు అప్‌

Wednesday 19th September 2018

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ బుధవారం ఉదయం 8.30 గంటల సమయానికి 40 పాయింట్ల పెరుగుదలతో 11,347 పాయింట్ల వద్ద ట్రేడవుతుంది. క్రితం రోజు ఇక్కడ భారీ పతనం తర్వాత నిఫ్టీ ఫ్యూచర్‌ 11,407 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానమయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 40 పాయింట్లు పెరిగింది. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 1 శాతంపైగా

Most from this category