STOCKS

News


రూపాయి పతనంతో నష్టాలే... నష్టాలు

Thursday 18th October 2018
Markets_main1539833870.png-21252

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనం- ఎగుమతిదారులకు ప్రయోజనకరమన్న వాదన ఉంది. దిగుమతులు తగ్గుతాయన్న విశ్లేషణలూ ఉన్నాయి. అయితే వాస్తవంలో ఇలా జరగాలేదని బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అధ్యయనం ఒకటి విశ్లేషించింది. వివరంగా చూస్తే...
♦ ఎగుమతుల కోణంలో...: ఎగుమతిదారులు తమ ఎగుమతుల విలువను డాలర్లలో సంపాదించుకుంటారు. ఈ డాలర్లను దేశంలో మార్చుకుంటే, ఎక్కువ రూపాయలు వారి చేతికి అందుతాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత దీనికి కారణం. దేశీయంగా గిట్టుబాటు ధర ఉంటుంది కనక, అంతర్జాతీయంగా భారత్‌ ఎగుమతిదారులు కొంత తక్కువ ‘డాలర్ల’కైనా కాంట్రాక్టులు కుదుర్చుకునే పరిస్థితి ఉంటుందని, దీనివల్ల ప్రపంచ విపణిలో భారత ఎగుమతిదారుకు పోటీ తత్వం పెరుగుతుందని, ఆయా పరిస్థితులు దేశం నుంచి ఎగుమతులు మరింత  పెరగటానికి దారి తీస్తాయనేది ఒక విశ్లేషణ. 
♦  దిగుమతుల పరంగా..: ఇక ఏదన్నా ఉత్పత్తి మన దేశానికి దిగుమతి చేసుకుంటే, డాలర్లలో అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల దిగుమతులూ నెమ్మదించే అవకాశం ఉందన్నది అంచనా. 
♦  పై రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఎస్‌బీఐ చేసిన అధ్యయనం... కీలక అంశాలను వెల్లడించింది. రూపాయి బలహీనత వల్ల అటు ఎగుమతులూ పెరగలేదని, ఇటు దిగుమతులూ మందగించలేదని ‘ఇకోరాప్‌’ పేరుతో విడుదలైన ఈ అధ్యయనంలో పేర్కొంది. పైగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) వాణిజ్య లోటు (ఎగుమతులూ- దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) అదనంగా 4 బిలియన్‌ డాలర్లు పెరిగిందని వివరించింది. ‘‘దీనర్ధం ఎగుమతులు తగ్గాయని. దిగుమతులు పెరిగాయని’’ అని పేర్కొంది. 
♦  సిద్ధాంతం ప్రకారం- ఒక దేశ కరెన్సీ బలహీనపడితే, ఆ దేశ ఎగుమతులు పెరిగే అవకాశం ఉండడం సహజమే. అయితే రూపాయికన్నా ఎక్కువగా ఇతర దేశాల కరెన్సీలు బలహీనపడుతుండడం వల్ల తాజా పరిస్థితి (రూపాయి పతనం) నుంచి భారత్‌ ప్రయోజనం పొందలేకపోతోంది. పైగా ముడి చమురు సహా కొన్ని ఉత్పత్తులను భారత్‌ తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. 
♦  ఐదు నెలల తర్వాత మొదటిసారి సెప్టెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా, -2.15 శాతం క్షీణత నమోదుకావడం మరో అంశం. 2017 సెప్టెంబర్‌తో పోల్చితే ఇంజనీరింగ్‌, రత్నాలు, ఆభరణాలుసహా పలు రంగాల ఎగుమతులు తగ్గాయి. 
♦  ఇదే సమయంలో దిగుమతులు 10.45 శాతం (41.9 బిలియన్‌ డాలర్లు) పెరిగాయి. 
♦  విదేశీ వాణిజ్య రుణాలు నెలవారీ గణాంకాలను చూస్తే, 2018 మార్చి నుంచి 2018 మార్చి మధ్య ఆటోమేటిక్‌ రూట్‌ ద్వారా పలు కంపెనీలు భారీ రుణాలను సమీకరించాయి. వీటిలో విద్యుత్‌, టెలికమ్యూనికేషన్‌, ఆటోమొబైల్‌ రంగాలు ఉన్నాయి. మొత్తం ఈసీబీల్లో ఆయా కంపెనీల వాటా దాదాపు 71 శాతం. 
♦  ఇదే పరిస్థితి కొనసాగితే, కంపెనీల నికర లాభాలపై తీవ్ర ప్రభావం కొనసాగే అవ‍కాశం ఉంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనడానికి, రూపాయి పతన ఇబ్బందులను పరిష్కరించుకోడానికి కంపెనీలు తగిన ‘హెడ్జింగ్‌’ విధానాలను అనుసరించాల్సి ఉంటుంది. 
 
నిన్న రికవరీ... నేడు నీరసం!
ఇదీ... రూపాయి పరిస్థితి...

డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. మంగళవారం రూపాయి విలువ బలపడితే, గురువారం మళ్లీ కిందకు జారింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ బుధవారం 13 పైసలు బలహీనపడి, 73.61 వద్ద ముగిసింది. బలహీన దేశీయ ఈక్విటీ మార్కెట్లు, అమెరికన్‌ డాలర్‌ ఇండెక్స్‌ కీలక నిరోధ స్థాయి 95ను దాటడం దీనికి నేపథ్యం. ఈ నెల 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత 10,11,12 తేదీల్లో వరుసగా 18, 09, 55 పైసలు చొప్పున మొత్తం 82 పైసలు బలపడింది. అయితే సోమవారం (15వ తేదీ) ట్రేడింగ్‌లో మళ్లీ 26 పైసలు పడిపోయింది. మంగళవారం అంతకుమించి 35 పైసలు లాభపడ్డం గమనార్హం. 
 
 



You may be interested

రాణా కపూర్‌కు ఆర్‌బీఐ నో

Thursday 18th October 2018

ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ నిరాకరించింది. కొత్త చీఫ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1లోగా నియమించాలని బ్యాంకు బోర్డును ఆదేశించింది. స్టాక్ ఎక్స్చేంజీలకు యస్‌ బ్యాంక్ బుధవారం ఈ విషయాలు తెలియజేసింది. "యస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా రాణా కపూర్ వారసుణ్ని 2019 ఫిబ్రవరి 1లోగా ఎంపిక చేయాలని రిజర్వ్ బ్యాంక్ పునరుద్ఘాటించింది" అని వివరించింది.

మైండ్‌ ట్రీ లాభం 65 శాతం అప్‌

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: మధ్య తరహా ఐటీ కంపెనీ మైండ్‌ ట్రీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 65 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.125 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.206 కోట్లకు పెరిగిందని మైండ్‌ ట్రీ తెలిపింది. ఆదాయం రూ.1,332 కోట్ల నుంచి 32 శాతం పెరిగి రూ.1,755 కోట్లకు చేరిందని మైండ్‌ట్రీ సీఈఓ, ఎమ్‌డీ రోస్టో రావణన్‌

Most from this category