STOCKS

News


రూపీ @ 74

Friday 5th October 2018
Markets_main1538730945.png-20895

ఇండియన్‌ రూపాయి నిట్టనిలువునా కుప్పకూలింది. ఇప్పటికే క్రూడ్‌ ధరల పెరుగుదల, డాలర్‌ బలపడటం వంటి వాటితో ఒత్తిడి ఎదుర్కొంటున్న రూపాయిపై.. ఆర్‌బీఐ తాజా సమీక్షలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నాం 2:45 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి తొలిసారిగా 74 మార్క్‌ దిగువకు పడిపోయింది. కాగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం 73.64 వద్ద ప్రారంభమైంది. తర్వాత అక్కడక్కడే కదలాడుతూ వచ్చింది. అయితే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడంతో ఒక్కసారిగా 74 మార్క్‌కు పడిపోయింది.  



You may be interested

రికవరీ కన్నా ముందు మరింత పతనం!

Friday 5th October 2018

దేశీ మార్కెట్‌పై సీఎల్‌ఎస్‌ఏ క్రిస్‌వుడ్‌ అంచనా భారత మార్కెట్లు బాగుపడేముందు మరింత పతనానికి గురవుతాయని సీఎల్‌ఎస్‌ఏ అనలిస్ట్‌ క్రిస్‌వుడ్‌ అంచనా వేశారు. ఇప్పుడున్న స్థాయిల నుంచి మరింత పతనమయ్యాకనే సూచీలు తిరిగి పాజిటివ్‌ అడుగులు వేస్తాయన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం బయటపడ్డాక వచ్చిన పతనంతో తమ ఆసియా పోర్టుఫోలియో బాగా దెబ్బతిన్నదని చెప్పారు. తమ పెట్టుబడుల్లో 49 శాతం ఇండియాలో ఉన్నాయన్నారు. ఇందులో సింహభాగం వాటా ఫైనాన్షియల్స్‌దే కావడం గమనార్హం. తాజా పతనంలో

అంచనాలు తల్లకిందులు

Friday 5th October 2018

అంచనాలు తలకిందులయ్యాయి. ఆర్‌బీఐ నిర్ణయం విశ్లేషకులు, బ్యాంకర్లను అయోమయానికి గురిచేసింది! ఒకపక్క మన కరెన్సీ రూపాయి రోజురోజుకు డాలర్‌ ముందు బక్కచిక్కుతోంది. మరోపక్క అంతర్జాతీయంగా చమురు ధరలు ఉరుముతున్నాయి. ఇంకో పక్క దేశీయ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. ఇన్ని సమస్యలు చుట్టుముట్టిన తరుణంలోనూ... ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వరుసగా మూడు రోజుల పాటు సమావేశమై... ఒక్క నివారణ చర్య

Most from this category