STOCKS

News


ఆఫ్‌షోర్‌లో 74 మార్క్‌కు దిగువునే రూపీ

Saturday 6th October 2018
Markets_main1538800861.png-20905

ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం రాత్రి 74 మార్క్‌ దిగువకు పడిపోయింది. 74.16 వద్ద ముగిసింది. ఒకానొక సమయంలో 74.63 స్థాయికి కూడా పతనమైంది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే సోమవారం రూపాయి నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. 

ఇండియన్‌ రూపాయి శుక్రవారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో నిట్టనిలువునా కుప్పకూలింది. క్రూడ్‌ ధరల పెరుగుదల, డాలర్‌ బలపడటం వంటి వాటితో ఇప్పటికే ఒత్తిడి ఎదుర్కొంటున్న రూపాయిపై.. ఆర్‌బీఐ తాజా సమీక్షలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నాం 2:45 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి తొలిసారిగా 74 మార్క్‌ దిగువకు పడిపోయింది. ఒకదశలో 74.23కు పతనమైంది. అయితే చివరకు కొంత రికవరీతో 73.76 వద్ద ముగిసింది. కాగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం 73.64 వద్ద ప్రారంభమైంది. తర్వాత అక్కడక్కడే కదలాడుతూ వచ్చింది. అయితే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడంతో ఒక్కసారిగా 74 మార్క్‌కు పడిపోయింది. 



You may be interested

భారత్‌లో అస్తవ్యస్త పన్ను విధానాలు

Saturday 6th October 2018

న్యూఢిల్లీ: భారత్‌లో పన్ను విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయంటూ రష్యన్ ఇంధన దిగ్గజం రాస్‌నెఫ్ట్‌ విమర్శించింది. దేశంలో కార్యకలాపాల విస్తరణకు ఇవే ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది. "భారతీయ కంపెనీ రష్యాలో ఇన్వెస్ట్ చేస్తే.. సాధారణంగానే పన్నులు కట్టాల్సి ఉంటుంది. డివిడెండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదే మా కంపెనీ గానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే.. పన్నులు, డివిడెండ్లతో పాటు మాపై మరో 20 శాతం మేర విత్‌హోల్డింగ్ ట్యాక్స్ కూడా విధిస్తున్నారు.

వేదాంత ఏడీఆర్‌ రివర్స్‌..

Saturday 6th October 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు తగ్గాయి. విప్రో ఏడీఆర్‌లో ఎలాంటి మార్పు లేదు. తటస్థంగా ఉంది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ మాత్రం పెరిగింది. వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పడిపోయింది.   టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 2.75 శాతం క్షీణతతో 14.52 డాలర్లకు తగ్గింది.

Most from this category