STOCKS

News


27పైసలు బలపడిన రూపాయి

Thursday 11th April 2019
Markets_main1554967308.png-25068

న్యూఢిల్లీ: గత రెండురోజులుగా ర్యాలీ చేస్తున్న రూపాయి విలువ గురువారం తీవ్ర ఒడిదుడులకులకు లోనవుతోంది. నేడు ఫారెక్స్‌ మార్కెట్లలో డాలర్‌ మారకంలో రూపాయి 9 పైసలు క్షీణతతో 69.20 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయంగా డాలర్‌ ఇండెక్స్‌ తిరిగి పుంజుకోవడంతో ఎగుమతిదారులు, బ్యాంకర్లు డాలర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి విలువ  ఇంట్రాడేలో 27 పైసలు బలపడి 68.84 స్థాయికి చేరుకుంది. మధ్యా‍హ్నం గం 2:00లకు డాలర్‌ మారకంలో రూపాయి విలువ గత ముగింపు(69.11) 17పైసలు నష్టపోయి 68.93 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం రూపాయి పతనాన్ని అడ్డుకుంటుందని ఫారెక్స్‌ విశ్లేషకులంటున్నారు. కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ ఈసారి కూడా  మెతక వైఖరీ ప్రదర్శించవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ ఇండెక్స్‌ 2వారాల కనిష్టానికి పతనం కావడం, భారత ఆర్థిక వ్యవస్థ జోరు పట్ల ఐఎమ్‌ఎఫ్‌ ఆశావహ అంచనాలతో గత రెండు ట్రేడింగ్‌ సెషన్స్‌లోనే 56పైసలు బలపడింది.



You may be interested

ఎన్నికల వేళ ఎలారా నుంచి సేఫ్‌ స్టాక్స్‌!

Thursday 11th April 2019

రెండు నెలల కన్సాలిడేషన్‌ తర్వాత సూచీలు మార్చిలో పుంజుకున్నాయి. ఎఫ్‌ఐఐ నిధుల ప్రవాహం, మోదీ ప్రభుత్వం మరలా వస్తుందన్న ఆశలు, అంతర్జాతీయంగా లిక్విడిటీ సరళీకరణ విధానాలు.. మార్కెట్‌ను పరుగులు తీయించాయిన ఎలారా క్యాపిటల్‌ తెలిపింది. అయితే ఇకపై ఎన్నికలు దగ్గరపడినందున సూచీల్లో ఆటుపోట్లు అధికంగా ఉంటాయని తెలిపింది. గతేడాది సరాసరితో పోలిస్తే ఇండియా వీఐఎక్స్‌ చాలా ఎక్కువైందని, అందువల్ల సూచీల్లో అధికస్థాయిలో కదలికలుంటాయని అంచనా వేసింది. ఎన్నికల ఫలితాలు ఎకానమీలో

మహీంద్రాతో ఫోర్డ్ జాయింట్ వెంచర్‌

Thursday 11th April 2019

- ఒప్పందంపై తుది దశల్లో చర్చలు - భారత్ నుంచి పాక్షిక నిష్క్రమణ? న్యూఢిల్లీ: భారత మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోవడం కష్టతరంగా మారుతుండటంతో విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు క్రమంగా కార్యకలాపాలు తగ్గించుకుంటున్నాయి. అమెరికన్ సంస్థ జనరల్ మోటార్స్‌ .. భారత్‌లో కార్యకలాపాలను తగ్గించుకోవడంతో పాటు దేశీయంగా కార్ల విక్రయాలు నిలిపివేసింది. తాజాగా అదే బాటలో మరో అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్‌ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ తాజాగా భారత్‌లో

Most from this category