STOCKS

News


రూపాయికి ‘చమురు’ ఇంధనం!

Wednesday 21st November 2018
Markets_main1542775805.png-22247

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా ఆరవరోజూ రికవరీ అయ్యింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ సోమవారం ముగింపుతో పోల్చితే 21 పైసలు బలపడింది. 71.46 వద్ద ముగిసింది. సోమవారం ముగింపు 71.67. మొత్తం ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో 143 పైసలు బలపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరల భారీ పతనం, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండడం వంటి అంశాలు రూపాయి బలోపేతానికి తక్షణ కారణాలు. అంతర్జాతీయ వృద్ధి మందగమనానికి అవకాశం ఉందని అమెరికా ఫెడ్‌ తాజా వ్యాఖ్యలు, దీనితో రెండు వారాల గరిష్ట స్థాయి నుంచి కిందకు జారిన డాలర్‌ ఇండెక్స్‌ రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ వ్యూహకర్త ఆనంద్‌ జేమ్స్‌ అభిప్రాయపడ్డారు. ఎగుమతిదారులు, బ్యాంకర్ల డాలర్‌ అమ్మకాలు,  ట్రేడింగ్‌ ప్రారంభంతోనే రూపాయి పటిస్టంగా 71.39 వద్ద ప్రారంభమైంది. అటు తర్వాత 71.27కూ బలపడింది.

క్రూడ్‌ భారీ పతనం...
 తాజా గణాంకాలు చూస్తే, అంతర్జాతీయ మార్కెట్‌- నైమెక్స్‌లో లైట్‌ స్వీట్‌క్రూడ్‌ బ్యారల్‌ ధర ఈ వార్త రాసే సమయానికి కీలక మద్దతు 55.40 స్థాయిని కోల్పోయింది. (ఈ స్థాయిని అధిగమించడానికి దాదాపు ఏడాదిన్నర పట్టింది). ఐదు శాతానికి పైగా పతనంతో 53.66కు పతనం అయ్యింది. ఈ ఏడాది డబ్ల్యూటీఐ ‍క్రూడ్‌ ఫ్యూచర్స్‌ గరిష్టస్థాయి 76.90. ఇక భారత్‌ ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్‌ ఈ ఏడాది గరిష్టస్థాయి 86.74 అయితే నెమ్మదిగా కిందకు దిగుతూ, మంగళవారం 10 గంటల సమయంలో ఐదుశాతానికి పైగా పతనమై 63.12ను తాకింది. ఇక ఈ వార్త రాసే రాత్రి 10 గంటలకు డాలర్‌ ఇండెక్స్‌ 96.51 వద్ద ట్రేడవుతుండగా, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 71.45 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

‘జీ’పై విదేశీ దిగ్గజాల కన్ను!?

Wednesday 21st November 2018

సుభాష్‌ చంద్ర... దేశీ మీడియా రంగంలో సుపరిచితమైన పేరు. జీ టెలివిజన్‌ చానెళ్లతో విదేశీ మీడియా సంస్థలకు ధీటుగా వ్యాపారాన్ని విస్తరించారు. అయితే, హఠాత్తుగా ప్రధాన కంపెనీలో వాటాలను విక్రయించాలని నిర్ణయించడంతో మీడియాలో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారింది. తన వ్యాపారానికి మూల స్తంభంలాంటి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జీల్‌) పగ్గాలను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ మీడియా దిగ్గజాలు, టెక్నాలజీ కంపెనీలతో పాటు దేశీయంగా

మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్లు !

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: వాతావరణ కాలుష్యం నివారణకు ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్లు మంచి పరిష్కారమని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యానించారు. భారత్‌లోని ఢిల్లీ తదితర పెద్ద నగరాల్లో కాలుష్యం సమస్య మరింత తీవ్రమవుతోందని, దీని నుంచి గట్టెక్కేందుకు భారత్‌లో ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్లను అందించే విషయమై కసరత్తు చేస్తున్నామని వివరించారు. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ మోటార్‌తో పనిచేసే ఎలక్ట్రిక్‌ కిక్‌ స్కూటర్‌ గంటకు 25 కిమీ. దూరం గరిష్ట వేగంతో

Most from this category