News


రూపాయి... 6 రోజుల్లో 161 పైసలు రన్‌!

Tuesday 19th March 2019
Markets_main1552977270.png-24681

- సోమవారం ఒక్కరోజే 
57పైసలు లాభం
- 68.53 వద్ద ముగింపు
- ఏడు నెలల గరిష్టం

న్యూఢిల్లీ: రూపాయి అప్రతిహత పురోగమనం కొనసాగుతోంది. సోమవారం వరుసగా ఆరవ ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభాల బాటన పయనించింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో 57 పైసలు లాభపడింది. 68.53 వద్ద ముగిసింది.  ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో రూపాయి 161 పైసలు లాభపడింది.  2018 ఆగస్టు 1వ తేదీన రూపాయి ముగింపు 68.43. అప్పటి తర్వాత రూపాయి మళ్లీ తాజా స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి.  శుక్రవారం రూపాయి ముగింపు 69.10. సోమవారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ ఎక్స్చేంజ్‌లో 68.92 వద్ద పటిష్టంగా రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఒక దశలో 68.45న కూడా చూసింది. 
కారణాలను విశ్లేషిస్తే...
- ఎన్నికల అనంతరం దేశ ప్రధానిగా మళ్లీ నరేంద్రమోదీనే పగ్గాలు చేపడతారన్న విశ్లేషణలు
-  ఈ అంచనాల నేపథ్యంలో డెట్‌, ఈక్విటీ మార్కెట్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ‍ప్రవాహం.
- క్రూడ్‌ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా స్థిరంగా ఉండడం.
- దీనితో ద్రవ్యోల్బణం ‍కట్టడిలో ఉంటుందన్న విశ్లేషణలు.
- వృద్ధి క్రియాశీలతకు రేటు తగ్గింపు ఉంటుందన్న అంచనాలు.
- డాలర్‌ ఇండెక్స్‌ కదలికలపై అనిశ్చితి.
- అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌- రేటు (ప్రస్తుత శ్రేణి 2.25-2.50) పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందన్న అభిప్రాయం. బుధవారం సమీక్ష సందర్భంగా రేటు పెంపు ఉండదన్న విశ్లేషణలు. 
- మూడేళ్ల ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ స్వాప్‌ ఆక‌్షన్‌ ద్వారా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఐదు బిలియన్‌ డాలర్ల లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) వ్యవస్థలోకి పంప్‌ చేస్తోందన్న వార్త.

74.39 కనిష్టం నుంచి...
అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 13 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72-70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. అయితే క్రూడ్‌ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ఆసియా కరెన్సీల్లోనే ఉత్తమ పనితీరు...
వరుసగా ఆరవరోజూ రూపాయి పటిష్ట రికవరీ బాటన నడిచింది. ఆసియా దేశాల కరెన్సీలన్నింటిలోనూ ఉత్తమ పనితీరు కనబరిచింది. వాణిజ్యలోటు (ఫిబ్రవరిలో 9.6 బిలియన్‌ డాలర్లు) సానుకూల స్థితి, దేశంలోకి విదేశీ నిధుల ప్రవాహం దీనికి కారణం. మీరు ఎక్స్చేంజ్‌ గణాంకాలను గమనించండి. ఈ నెలల్లో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు 2.4 బిలియన్‌ డాలర్లు ఈక్విటీల్లో పెట్టుబడులుగా పెట్టారు. దీనితో భారత్‌ మార్కెట్లో వారి నికర కొనుగోళ్లు 4.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ నెల్లో రూపాయి డినామినేటెడ్‌ బాండ్లలో వారి హోల్డింగ్స్‌ 833 మిలియన్‌డాలర్లు పెరిగాయి. 
- వీకే శర్మ, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌You may be interested

మార్కెట్లోకి స్కోడా ఆక్టావియా కార్పొరేట్ ఎడిషన్ కారు

Tuesday 19th March 2019

- ధర రూ. 15.49 లక్షలు నుంచి ప్రారంభం న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో ఇండియా తాజాగా తమ ప్రీమియం సెడాన్ కారు ఆక్టావియాలో కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఆక్టావియా కార్పొరేట్ ఎడిషన్ పేరుతో విడుదల చేసిన ఈ కారు (పెట్రోల్‌ ఇంజిన్‌) ధర రూ. 15.49 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంటుంది. ఇక డీజిల్‌ వేరియంట్ రేటు రూ. 16.99 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంటుందని కంపెనీ తెలిపింది. పెట్రోల్

మూడోరోజూ లాభాల్లోనే

Tuesday 19th March 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మూడో రోజూ లాభపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత ఇందుకు కారణవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర మంగళవారం 6డాలర్లు పెరిగింది. నేటి నుంచి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య సమీక్షా సమావేశం ప్రారంభం కానుంది. రేపటితో ముగిసే ఈ సమావేశంలో ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లను యథాతధంగా ఉంచుతుందని ఆర్థిక విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో ఆరు ప్రధాన కరెన్సీ

Most from this category