STOCKS

News


ఆర్‌బీఐ-కేంద్రం సయోధ్య.. రూపీకి బలం..

Tuesday 20th November 2018
Markets_main1542689065.png-22217

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి మంగళవారం లాభాల్లో ట్రేడవుతోంది. రూపాయి బలపడటం ఇది వరుసగా ఆరో సెషన్‌. అలాగే రూపాయి వరుసగా ఇన్ని సెషన్లు పెరగడం 2017 అక్టోబర్‌ నుంచి చూస్తే ఇదే ‍ప్రధమం. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య సోమవారం జరిగిన సమావేశంలో దాదాపు కీలక అంశాలన్నిటి మధ్య సయోధ్య కుదరడం సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.45 శాతం లాభంతో 71.33 వద్ద ట్రేడవుతోంది. రూపాయి సోమవారం ముగింపు స్థాయి 71.66గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి మంగళవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 71.48 వద్ద ప్రారంభమైంది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.763 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.791 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 5.04 శాతం మేర పెరిగింది. ప్రస్తుత సంవత్సరం మొత్తంగా చూస్తే రూపాయి 10.5 శాతం మేర పతనమైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 5.18 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.57 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 
ఆసియా ప్రధాన కరెన్సీలు దాదాపుగా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల పరిష్కారంపై నిరాశావాదంతో ఉండటం ప్రతికూల ప్రభావం చూపింది. ఫిలిప్పిన్స్‌ పెసో 0.15 శాతం, థాయ్‌ బట్‌ 0.08 శాతం, జపాన్‌ యెన్‌ 0.04 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.04 శాతం తగ్గాయి. అయితే దక్షిణ కొరియా ఒన్‌ 0.17 శాతం, ఇండోనేసియా రుపియ 0.16 శాతం, మలేసియా రింగిట్‌ 0.08 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.07 శాతం పెరిగాయి. 
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 96.193తో పోలిస్తే 0.03 శాతం పెరుగుదలతో 96.218 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

స్థిరంగానే పసిడి ధర

Tuesday 20th November 2018

అమెరికా బలహీన ఆర్థిక గణాంకాల విడుదల, ప్రపంచ ఆర్థిక మందగమనంపై ఫెడ్‌ అధికారుల ఆందోళన తదితర అంశాలు డాలర్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. పసిడి ధరకు ఈ అంశం సానుకూలంగా మారింది. ఫలితంగా మంగళవారం ప్రపంచమార్కెట్లో పసిడి స్థిరమైన ర్యాలీ చేస్తుంది. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 1.00డాలర్లు స్వల్పంగా నష్టపోయి 1,224.30 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. రాత్రి అమెరికా

13 నెలల కనిష్టస్థాయికి బిట్‌కాయిన్‌

Tuesday 20th November 2018

  వరుసగా 8వ రోజూ క్షీణత ఒక్కరోజులోనే 13% పతనం 4,805 డాలర్ల వద్ద కనిష్టస్థాయి నమోదు క్రిప్టోకరెన్సీ విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా అవతరించిన బిట్‌కాయిన్‌ తాజాగా 5,000 డాలర్ల మార్కును కోల్పోయింది. సరిగ్గా ఏడాది కిందట 20,000 డాలర్లకు సమీపించి.. మరింత ముందుకు వెళ్లడం ఖాయం అనే భ్రమలు కల్పించిన ఈ డిజిటల్‌ కరెన్సీ, పలు దేశాల నియంత్రణా పరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో తిరోగమనం బాట పట్టింది. భారతదేశంలో క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత లేదని ఆర్థికమంత్రి

Most from this category