News


రూపీ రయ్‌.. రయ్‌..

Wednesday 19th December 2018
Markets_main1545193240.png-23056

  • 70 మార్క్‌ దిగువున్న ట్రేడ్‌ అవుతోన్న దేశీ కరెన్సీ

ఇండియన్‌ రూపాయి వేగంగా రికవరీ అవుతోంది. బుధవారం కూడా లాభాల్లోనే ప్రారంభమైంది. క్రూడ్‌ ధరలు 16 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, బహిరంగ మార్కెట్‌లో బాండ్లను కొనుగోలు చేస్తామని మళ్లీ ఆర్‌బీఐ ప్రకటించడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం 70.08 వద్ద ప్రారంభమైంది. రూపాయి బలపడుతూ రావడం ఇది వరుసగా మూడో సెషన్‌. ఉదయం 9:15 సమయంలో రూపాయి 69.94 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు (మంగళవారం) 70.45తో పోలిస్తే 0.81 శాతం లాభపడింది. 

భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 11 బేసిస్‌ పాయింట్ల మేర క్షీణించి 7.238 శాతానికి తగ్గింది. ఏప్రిల్‌ 9 నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు (మంగళవారం) 7.347 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్‌, ధరలు పరస్పరం వ్యతిరేక దిశల్లో ఉంటాయి. 

క్రూడ్‌ ఆయిల్‌ ధర మంగళవారం ఏకంగా 5 శాతానికి పైగా క్షీణించింది. ఓవర్‌ సప్లై, డిమాండ్‌ తగ్గుదల భయాలు, అమెరికాలో నిల్వలు పెరగడం వంటి అంశాలు ఇందుకు కారణం. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 7 శాతానికి పైగా క్షీణతతో 46.24 డాలర్ల వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 5 శాతానికి పైగా క్షీణతతో 56.26 డాలర్ల వద్ద కదలాడుతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 14 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి దాకా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 15 శాతానికి పైగా క్షీణించాయి. 2018 గరిష్ట స్థాయిల నుంచి 34 శాతానికి పైగా పతనమయ్యాయి. 

క్రూడ్‌ ధరలు తగ్గటం భారత్‌కు అతిపెద్ద పాజిటివ్‌ అంశం. కరెంట్‌ అకౌంట్‌ లోటు తగ్గుతుంది. రూపాయి బలపడుతుంది. మరోవైపు ఆర్‌బీఐ జనవరిలో బహిరంగ మార్కెట్‌ ద్వారా రూ.50,000 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దీని వల్ల వ్యవస్థలో లిక్విడిటీ మరింత పెరుగుతుంది. ఇది కూడా రూపాయికి పాజిటివ్‌ అంశమే. ఇకపోతే విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్లలో (ఈక్విటీ, డెట్‌) ఇన్వెస్ట్‌ చేస్తూనే ఉన్నారు. నవంబర్‌లో ఎఫ్‌ఐఐలు 1.76 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేస్తే, డిసెంబర్‌లో ఇప్పటి దాకా 677 మిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేశారు. దీని వల్ల రూపాయికి బలం పెరిగింది. 

ఇండియన్‌ రూపాయి ఈ ఏడాది ఇప్పటి దాకా 8.7 శాతం మేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 4.44 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 7.34 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. 



You may be interested

యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా బ్రహ్మ్‌దత్‌ !

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా డైరెక్టర్లలో ఒకరైన బ్రహ్మ్‌ దత్‌ పేరును రిజర్వు బ్యాంకుకు యస్‌బ్యాంక్‌ సిఫారసు చేసినట్లు తెలియవచ్చింది. గత నెలలో చైర్మన్‌ పదవికి అశోక్‌ చావ్లా రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. యస్‌ బ్యాంక్‌ ఈ పదవికి బ్రహ్మ్‌దత్‌ను ఎంపిక చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దత్‌ ఇప్పటికే డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయనకు బ్యాంక్‌కు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన ఉందని, అందుకే చైర్మన్‌

మార్కెట్‌కు రూపీ, క్రూడ్‌ బూస్ట్‌..

Wednesday 19th December 2018

10,950 పైకి నిఫ్టీ సెన్సెక్స్‌ 100 పాయింట్లు అప్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ జోరుమీదుంది. గత రెండు రోజూలు లాభాల్లో ముగిసిన ఇండెక్స్‌లు బుధవారం కూడా గ్యాప్‌అప్‌తోనే ప్రారంభమయ్యాయి. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,908 పాయింట్లతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 10,930 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,347 పాయింట్లతో పోలిస్తే 94 పాయింట్ల లాభంతో 36,441 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం గడిచే

Most from this category