STOCKS

News


రెండు వారాల కనిష్టానికి రూపాయి

Tuesday 23rd April 2019
Markets_main1555995157.png-25282

డాలర్‌తో 32 పైసలు నష్టం ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 32 పైసలు నష్టపోయింది. ఫారెక్స్‌ మార్కెట్లో 69.88 వరకు తగ్గిన రూపాయి చివరికి 69.67 వద్ద ముగిసింది. ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. ఇరాన్‌ చమురు దిగుమతులపై మినహాయింపులను అమెరికా ఎత్తివేయనుందన్న వార్తలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల రూపాయిపై ప్రభావం చూపించిందని, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాల స్వీకరణ సైతం ఇందుకు కారణమైనట్టు ఆనంద్‌ రాఠి షేర్స్‌ అండ్‌ స్టాక్‌బ్రోకర్స్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రుషబ్‌ మారు తెలిపారు.



You may be interested

హైదరాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్‌ డేటా సెంటర్‌

Tuesday 23rd April 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ ఈ–కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను ప్రారంభించింది. ఇది తెలంగాణలో మొదటిదని, దేశంలో రెండో సెంటర్‌ అని ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్‌కు చెందిన డేటా సెంటర్‌ ఆపరేటర్‌ ‘కంట్రోల్‌ ఎస్‌’ (సీటీఆర్‌ఎల్‌ ఎస్‌) పార్టనర్‌షిప్‌తో దీన్ని నిర్మించినట్లు తెలిపింది. ఈ సెంటర్‌ ఏర్పాటుతో ఎక్కువ సంఖ్యలో స్థానిక తయారీ సంస్థలు. విక్రయదారులు, ఎంఎస్‌ఎంఈలను చేరుకునేందుకు వీలవుతుందని,

ఇరాన్‌ చమురుపై భారత్‌కు షాక్‌

Tuesday 23rd April 2019

- దిగుమతులను పూర్తిగా ఆపేయాలి: అమెరికా - లేకపోతే ఆంక్షలు తప్పవంటూ హెచ్చరిక వాషింగ్టన్‌: ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాతో పాటు అయిదు దేశాలకు అమెరికా షాకివ్వనుంది. ఇప్పటిదాకా దిగుమతి ఆంక్షల నుంచి ఇస్తున్న మినహాయింపులను ఎత్తివేయాలని నిర్ణయించింది. మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ నుంచి దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని, లేకపోతే ఆంక్షలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయా దేశాలను హెచ్చరించనుంది. అణ్వస్త్రాల తయారీ చేయొద్దన్న తమ మాటను బేఖాతరు

Most from this category