STOCKS

News


పతనమైన చమురు: పెట్రో షేర్లకు రెక్కలు

Thursday 12th July 2018
Markets_main1531385725.png-18245

ముంబై:- ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు దిగి రావడంతో దేశీయంగా గురువారం ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లు హావా కొనసాగుతోంది. ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న బీఎస్‌ఈలోని ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ నేడు 2.62శాతం లాభపడింది. ఇంట్రాడేలో 14295 పాయింట్ల గరిష్టాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం గం.2:00లకు సమయానికి ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచి 2శాతం లాభంతో 14215 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రెండేళ్ల తరువాత అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర ఒక్కరోజులోనే 6.50 శాతం పడిపోయింది. గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 72 డాలర్ల సమీపానికి పతనమయ్యింది. దాంతో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌లు పెద్ద ర్యాలీ జరిపాయి. ఇక దేశీయ మార్కెట్లో అత్యధికంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 6శాతం లాభపడగా, అదేబాటలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ షేరు 5.50శాతం ర్యాలీ చేసింది. ఇక ఇదే రంగానికి చెందిన బీపీసీఎల్‌ 5శాతం, హెచ్‌పీసీఎల్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌, షేర్లు 3 నుంచి 2శాతం ర్యాలీ చేసాయి. ఓఎన్‌జీసీ, ఐజీఎల్‌, గెయిల్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. అయితే ఈ ఇండెక్స్‌లో భాగమైన పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ షేరు మాత్రం 1శాతానికి పైగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఈ 3 ఆయిల్‌ రంగ షేర్లలో ర్యాలీ..!

Thursday 12th July 2018

ముంబై: ఎర్నింగ్స్‌ వృద్ధి పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికవరీ చోటుచేసుకుంటుందని, క్యూ1 ఫలితాలు బలంగా ఉండనున్నాయని ఎమ్‌ఓఎస్‌ఎల్‌ (రీటైల్) రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖేమ్కా అన్నారు. అతి తక్కువ బేస్‌ ఇయర్‌ అయినందున తొలి త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉంటాయని భావిస్తున్నట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వస్తు సేవల పన్ను అమలు ప్రభావం అనేక రంగాలపై ఉండగా.. ఇవన్నీ గతేడాదిలో వెనుకబడి ఉన్నాయని, ఇప్పుడు

సుందరం ఏఎమ్‌సీ బెట్స్‌ ఇవే..!

Thursday 12th July 2018

ముంబై: గతేడాది సూచీలు బ్రహ్మాండమైన ర్యాలీని నమోదుచేయగా.. నిఫ్టీ 29 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 47 శాతం ర్యాలీ చేసి ఆశ్చర్యం కలిగించినట్లు సుందరం అసెట్ మేనేజ్‌మెంట్ సీఐఓ ఎస్ కృష్ణ కుమార్ అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జీవితకాల గరిష్టస్థాయిలను నమోదుచేసి అక్కడ నుంచి 10 శాతం వరకు కరెక్ట్‌ అయిన సూచీలు క్రమంగా పుంజుకుని మళ్లీ ఆస్థాయి వద్దకు చేరుకోగా.. ఇదే సమయంలో 12-20 శాతం

Most from this category