STOCKS

News


రూపీ స్వల్పకాలిక టార్గెట్‌ 67.50!

Friday 12th July 2019
Markets_main1562927462.png-27024

చార్ట్‌ అడ్వైజ్‌ అంచనా
కొన్ని వారాలుగా 69 స్థాయిల వద్ద కన్సాలిడేట్‌ చెందిన రూపాయి క్రూడాయిల్‌ ధరలుతగ్గడం, అంతర్జాతీయ పరిణామాలతో బలపడడం ఆరంభించింది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ప్రకటించిన చర్యలు రూపీ మరింత బలపడేందుకు దోహదం చేస్తాయని చార్ట్‌ అడ్వైజ్‌ ప్రతినిధి రాజా వెంకట్‌రామన్‌ అభిప్రాయపడ్డారు. వర్ధమాన మార్కెట్‌ ఎకానమీల్లో స్వల్పరికవరీ సైతం ఇందుకు తోడ్పాటునిస్తుందన్నారు. మార్కెట్లో గత పరిణామాలకు అనుగుణంగానే రూపీ 69 స్థాయిని తాకిందన్నారు. ఇకపై ఇక్కడ నుంచి బలపడనుందని చెప్పారు. ఈ విషయమై మరింత స్పష్టత రావాలంటే కొత్త ప్రభుత్వం అజెండాపై మరింత క్లారిటీ రావాల్సిఉందన్నారు. ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా రూపీ కదలికలుంటాయన్నారు.

ప్రపంచ ఆర్థిక మందగమన నేపథ్యంలో ఆర్‌బీఐ వరుసగా మూడోమారు కూడా రేట్లు తగ్గించింది. ఈ చర్య, బడ్జెట్‌ ‍ప్రతిపాదనలు కలిసి విదేశీ నిధులను ఆకర్షించవచ్చని రాజా చెప్పారు. కొన్ని నెలలుగా దేశ ఫారెక్స్‌ నిల్వలు గరిష్ఠాల వద్ద కదలాడుతున్నాయి. అందువల్ల రూపీలో స్థిరత్వం తెచ్చేందుకు ఆర్‌బీఐ వద్ద మరిన్ని సాధనాలుంటాయని చెప్పారు. చార్టుల్లో సైతం రూపీ మరింత బలపడే ఛాన్సులున్నాయని చెప్పారు. త్వరలో రూపీ 67.50 స్థాయి వరకు పతనం కావచ్చని చార్టులు సూచిస్తున్నాయన్నారు. రాబోయే వారాల్లో రూపీ బలోపేతం కావడం కొనసాగుతుందని, మిడ్‌టర్మ్‌కు రూపీ 69.50- 67.50 మధ్య కదలాడుతుందని అంచనా వేశారు. 



You may be interested

ఇన్ఫోసిస్‌ లాభం రూ. 3800 కోట్లు

Friday 12th July 2019

జూన్‌ త్రైమాసికానికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ. 3798కోట్ల నికరలాభం ప్రకటించింది. కంపెనీ రెవెన్యూ రూ. 21,803 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వృద్ధి అంచనాలను 7.5-9.5 శాతం నుంచి 8.5- 10.5 శాతానికి పెంచింది. కంపెనీ ఎబిటా 4431 కోట్ల రూపాయలుగా, ఎబిటా మార్జిన్‌ 20.5 శాతంగా నమోదు చేసింది. ఎబిటా మార్జిన్‌ గైడెన్స్‌ను 21- 23 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మార్కెట్‌

ఆద్యంతం ఊగిసలాట... నష్టాల ముగింపు

Friday 12th July 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ముగిశాయి. సెన్సెక్స్‌ 86.88 పాయింట్ల నష్టంతో 38,736.23 వద్ద, నిఫ్టీ 30.40 పాయింట్లును కోల్పోయి 11,552.50 వద్ద స్థిరపడింది. నేడు మార్కెట్‌ ముగింపు అనంతరం దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ క్యూ1 ఫలితాలను వెల్లడితో పాటు, మే మాసపు ఐఐపీ గణాంకాలు, జూన్‌ నెల వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) గణాంకాలు విడుదల కానుడంటంతో

Most from this category