STOCKS

News


2 బిలియన్‌ డాలర్లకుపైగా తగ్గిన విదేశీ మారక నిల్వలు!

Saturday 16th February 2019
Markets_main1550312625.png-24225

- ఫిబ్రవరి 8 నాటికి 398 
బిలియన్‌ డాలర్లు
ముంబై: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఫిబ్రవరి 8వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారం (1వ తేదీ)తో పోల్చిచూస్తే, 2.11 బిలియన్‌ డాలర్లు పడిపోయాయి. 398.122 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం...
- 1వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారకనిల్వలు వారంవారీగా 2.063 బిలియన్‌ డాలర్లు పెరిగి 400.24 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 
- వారం తిరిగే సరికి 8వ తేదీ నాటికి డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ 2.448 బిలియన్‌ డాలర్లు తగ్గి, 370.981కి పడ్డాయి. 
- పసిడి నిల్వలు స్థిరంగా 22.68 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 
- అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ విలువ 8 మిలియన్‌ డాలర్లు తగ్గి 1.462 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 
- ఇక ఐఎంఎఫ్‌కు సంబంధించి నిల్వల పరిమాణం 337.3 మిలియన్‌ డాలర్లు పెరిగి 2.991 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 
- 2018 ఏప్రిల్‌ 13వ తేదీతో మగిసిన వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వల రికార్డు స్థాయి 426.028 బిలియన్‌ డాలర్లు. అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.



You may be interested

భారత్‌ బయోటెక్‌ చేతికి చిరోన్‌ బెహరింగ్‌ వ్యాక్సిన్స్‌

Saturday 16th February 2019

భారత్‌ బయోటెక్‌ చేతికి చిరోన్‌ బెహరింగ్‌ వ్యాక్సిన్స్‌ రేబిస్‌ వ్యాక్సిన్లలో కంపెనీ స్థానం మరింత బలోపేతం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్‌ తయారీ కంపెనీ భారత్‌ బయోటెక్‌.. యూకేకు చెందిన గ్లాక్సోస్మిత్‌క్లిన్‌ (జీఎస్‌కే) ఏషియాకు చెందిన చిరోన్‌ బెహరింగ్‌ వ్యాక్సిన్స్‌ను కొనుగోలు చేయనుంది.  పూర్తిగా నగదు రూపంలో 100 శాతం వాటాను దక్కించుకోనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై శుక్రవారం ఇక్కడ ఒప్పందం జరిగింది. డీల్‌ విలువ ఎంతనేది మాత్రం స్పష్టం

జనవరిలో ఎగుమతులు అంతంతమాత్రం

Saturday 16th February 2019

వృద్ధి కేవలం 3.74 శాతం విలువలో 26.36 బిలియన్‌ డాలర్లు దిగుమతుల విలువ 41 బిలియన్‌ డాలర్లు వాణిజ్యలోటు 15 బిలియన్‌ డాలర్లు 38 శాతం పెరిగిన పసిడి దిగుమతులు న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు జనవరిలో నిరాశను మిగిల్చాయి. 2018 ఇదే నెలతో పోల్చిచూస్తే వృద్ధి రేటు కేవలం 3.74 శాతంగా నమోదయ్యింది. విలువ 25.51 బిలియన్‌ డాలర్ల నుంచి 26.36 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇక ఇదే సమయంలో దిగుమతులు 41 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

Most from this category