STOCKS

News


ఫారెక్స్‌ నిల్వలు @ 420.05 బిలియన్‌ డాలర్లు

Saturday 18th May 2019
Markets_main1558153232.png-25813

ముంబై: భారత విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్‌ రిజర్వ్స్‌) మే10వ తేదీతో ముగిసిన వారంలో 1.36 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 420.05 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో 171.9 మిలియన్‌ డాలర్లు పెరిగి 418.68 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) 1.35 బిలియన్‌ డాలర్లు పెరిగి 392.22 బిలియన్‌ డాలర్లకి చేరాయి. (అమెరికా డాలర్‌ మినహాయించి మిగిలిన కరెన్సీలైన యూరో, పౌండ్‌, యెన్ వంటి ఇతర నిల్వల పెరుగుదల/తరుగుదలను డాలర్లలోనికి మార్చి లెక్కిండాన్నే ఎఫ్‌సీఏగా వ్యవహరిస్తారు.) బంగారం నిల్వలు ఎటువంటి మార్పులులేకుండా 23.021 బిలియన్‌ డాలర్ల వద్ద ఉండగా.. అంతర్జాతీయంగా ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) వద్ద ఉన్న స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ విలువ 3 మిలియన్‌ డాలర్లు పెరిగి 1.454 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఫండ్‌తో నిల్వల స్థితి 7 మిలియన్‌ డాలర్లు పెరిగి 3.35 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. విదేశీ మారక నిల్వలు గతేడాది ఏప్రిల్ 13న 426.028 బిలియన్‌ డాలర్లకు చేరి జీవితకాల గరిష్ట స్థాయిని నమోదుచేసిన సంగతి తెలిసిందే. 



You may be interested

బజాజ్‌ ఆటో లాభం రూ.1,408 కోట్లు

Saturday 18th May 2019

ఒక్కో షేర్‌కు రూ.60 డివిడెండ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలపై కసరత్తు కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ వెల్లడి న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో మోటార్‌ బైక్‌ల అమ్మకాల జోరుతో బజాజ్‌ ఆటో కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో 20 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ4లో రూ.1,175 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,408 కోట్లకు పెరిగిందని బజాజ్‌ ఆటో తెలిపింది. మొత్తం

స్కూలు సేవలన్నిటికీ ‘క్రెడో’

Saturday 18th May 2019

అటెండెన్స్, ఫీజులు, అన్నీ యాప్‌ ద్వారానే  ప్రస్తుతం 60 స్కూళ్లు, కాలేజీలకు సేవలు  త్వరలో రూ.10 కోట్ల సమీకరణ  ‘స్టార్టప్‌ డైరీ’తో కె.శేషానంద రెడ్డి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విద్యారంగంలో టెక్నాలజీ బాగానే చొచ్చుకొచ్చేసింది. కాకపోతే అటెండెన్స్‌ వంటి విషయాల్లో ఇప్పటికీ సంప్రదాయ పద్ధతులే కొనసాగుతున్నాయి. అడ్మిషన్లు, స్టాఫ్‌ నిర్వహణ, స్టూడెంట్స్‌ అటెండెన్స్, ప్రోగ్రెస్‌ రిపోర్టులు, ఫీజులు.. ఇలా చాలా అంశాలను ఆన్‌లైన్‌లోకి తేవడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ సేవలందిస్తోంది

Most from this category