STOCKS

News


మళ్లీ 74 దిగువకు రూపీ

Monday 15th October 2018
Markets_main1539598599.png-21171

ఇండియన్‌ రూపాయి మళ్లీ 74 మార్క్‌ దిగువకు పడిపోయింది. మధ్యాహ్నాం 3:40 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 46 పైసలు క్షీణించి 74.03 వద్ద ట్రేడవుతోంది. కాగా రూపాయి సోమవారం నష్టాలతోనే ఆరంభమైంది. 73.80 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఆసియా కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతుండటం, క్రూడ్‌ ధరలు పెరగడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం ఒకేరోజు 55 పైసలు లాభపడి 73.57 వద్ద ముగిసింది. గత మూడు వారాల్లో ఒకే రోజు రూపాయి ఇంత ఎక్కువగా రికవరీ అవ్వడం ఇదే తొలిసారి. 



You may be interested

రెండో రోజూ లాభాలే

Monday 15th October 2018

10500 పైన ముగిసిన నిఫ్టీ రాణించిన ఐటీ షేర్లు ఫార్మా, ఐటీ షేర్ల ర్యాలీ అండతో మార్కెట్‌ రెండో రోజూ లాభాలతో ముగిసింది. ఇంట్రాడే తీవ్ర ఒడిదుడుకులతో ట్రేడింగ్‌ కొనసాగినప్పటికి చివరి గంటలో కొనసాగిన కొనుగోళ్ల పర్వంతో సూచీలు సోమవారం లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ 10500 పాయిం‍ట్లపైన ముగిసింది. సెన్సెక్స్‌ 150 పాయింట్లను ఆర్జించింది. చివరకు సెన్సెక్స్‌ 131 పాయింట్ల లాభంతో 34,865 వద్ద, నిఫ్టీ 40.00 పాయింట్ల లాభంతో 10512.50  పాయిం‍ట్ల వద్ద

టోకు ద్రవ్యోల్బణం 5.13 శాతం

Monday 15th October 2018

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో పెరిగింది. 5.13 శాతంగా నమోదయ్యింది. ఆహార పదార్ధాలు, ఇంధన ధరల పెరుగుదల ఇందుకు కారణం. వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఆగస్ట్‌లో డబ్ల్యూపీఐ 4.53 శాతం ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో ఇది కేవలం 2.6 శాతంగానే నమోదయ్యింది. 

Most from this category