రూపాయికి నాలుగు నెలలనాటి బలం
By Sakshi

ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ రికవరీ కొనసాగుతోంది. శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఒకేరోజు 27పైసలు లాభపడి 69.58 వద్ద ముగిసింది. క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టం నుంచి దాదాపు 30 డాలర్లు పతనం కావడం రూపాయి వేగవంతమైన రికవరీకి దారితీస్తోంది. దీంతోపాటు దేశంలోకి తాజా విదేశీ మూలధన నిధుల రాక కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 5 బిలియన్ డాలర్లు వెనక్కు తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు, నవంబర్‌లో భారత్ ఈక్విటీల్లో 558 మిలియన్ డాలర్ల తాజా పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత వేగంగా కోలుకుంటూ వచ్చింది. శుక్రవారం ట్రేడింగ్‌లో రూపాయి 69.68 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 69.57ను తాకింది.
You may be interested
ద్రవ్యలోటు భయాలు
Saturday 1st December 2018న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యలోటు భయాలు నెలకొన్నాయి. 2018-19 సంవత్సరంలో ద్రవ్యలోటు ఎంత ఉండాలని కేంద్ర బడ్జెట్ నిర్దేశించుకుందో, ఆ స్థాయిని ఇప్పటికే దాటిపోవడం దీని నేపథ్యం. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలు మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. 2018-19లో (ఏప్రిల్-మార్చి) ద్రవ్యలోటు రూ.6.24 లక్షల కోట్లుగా ఉండాని కేంద్ర బడ్జెట్ నిర్దేశించింది. అయితే ఇది అక్టోబర్ నాటికే నాటికే 6.48 లక్షల కోట్లకు పెరిగిపోయింది. అంటే బడ్జెట్
అమెరికాలో భారత నారీ భేరి
Saturday 1st December 2018న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళలు కూడా టెక్నాలజీ రంగంలో విజయపతాకం ఎగురవేస్తున్నారు. ఫోర్బ్స్ సంస్థ 2018 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ‘అమెరికాలో అగ్ర స్థాయి 50 మంది టెక్నాలజీ ప్రముఖుల’ జాబితాలో భారత సంతతికి చెందిన నలుగురు మహిళలు చోటు దక్కించుకోవటమే దీనికి నిదర్శనం. సిస్కో మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్, ఉబెర్ సీనియర్ డైరెక్టర్ కోమల్ మంగ్తాని, కన్‌ఫ్లూయంట్ సహ వ్యవస్థాపకురాలు నేహ