STOCKS

News


పడిపోయిన రూపాయి

Wednesday 29th August 2018
Markets_main1535517379.png-19736

ఇండియన్‌ రూపాయి బుధవారం బలహీనపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 22 పైసల నష్టంతో 70.32 వద్ద ప్రారంభమైంది. రూపాయి మునపటి ముగింపు 70.10గా ఉంది. దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరగడం ఇందుకు కారణం. అలాగే పలు ఇతర కరెన్సీలతో పోల్చిచూసిన కూడా డాలర్‌ బలపడింది. ఇక అమెరికా డాలర్‌తో ఇండియన్‌ రూపాయి మారవ విలువ బుధవారం 70.05- 70.50 శ్రేణిలో కదలాడవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. ఈ వారంలో అమెరికా క్యూ2 జీడీపీ గణాంకాలు, అమెరికా-కెనాడా చర్చలు వంటి అంశాలను గమనించాల్సి ఉందని పేర్కొంది.  



You may be interested

తగ్గనున్న మొండి బకాయిల భారం

Wednesday 29th August 2018

ముంబై: భారత్‌ బ్యాంకుల స్థూల మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం తగ్గనుందని  క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ- ఇక్రా విశ్లేషించింది. 2019 మార్చి నాటికి మొత్తం రుణాల్లో 10 శాతంగా ఉంటుందని అంచనావేస్తోంది. 2018 జూన్‌ 30 నాటికి భారత్‌ బ్యాంకింగ్‌ మొండిబకాయిల భారం 11.52 శాతం. ఇక నికర ఎన్‌పీఏల భారం ఈ ఏడాది జూన్‌ ముగిం‍పు నాటికి 5.92 శాతం ఉంటే 2019 మార్చి నాటికి ఈ రేటు 4.3

లాభనష్టాల మధ్య దోబూచులాట

Wednesday 29th August 2018

కొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతున్న ఇండెక్స్‌లు బుధవారం నెమ్మదించాయి. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,897 పాయింట్లతో పోలిస్తే 93 పాయింట్ల లాభంతో 38,990 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,738 పాయింట్లతో పోలిస్తే 7 పాయింట్ల లాభంతో 11,745 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే కొద్ది సేపటికే ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:36 సమయంలో నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో

Most from this category