రూపాయి రికవరీ
By Sakshi

ఇండియన్ రూపాయి మంగళవారం బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 14 పైసల లాభంతో 70.02 వద్ద ప్రారంభమైంది. రూపాయి మునపటి ముగింపు 70.16గా ఉంది. రూపాయి సోమవారం పాజిటివ్‌గానే ప్రారంభమైంది. ఒకానొక సమయంలో 69.65 స్థాయికి బలపడింది. అయితే చివరకు ఈ స్థాయిలో నిలువలేపోయింది. చివరకు రికార్డ్ కనిష్ట స్థాయి 70.16 వద్ద ముగిసింది.
డాలర్ బలహీన పడటం వల్ల గత తొమ్మిది సెషన్లలోనూ రూపాయి కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. అయితే సోమవారం ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సవరించడానికి అమెరికా, మెక్సికో దేశాలు అంగీకరించాయి. దీంతో ఒప్పందంలో కెనడా కొనసాగాలంటే ఆటో ట్రేడ్, వివాదాల పరిష్కారం కోసం రూపొందించిన కొత్త నిబంధనలు అంగీకరిచాల్సి ఉంది. దీంతో కెనడాపై ఒత్తిడి పెరిగిందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. అమెరికా, మెక్సికో ఒప్పంద అంగీకారం వల్ల డాలర్ మళ్లీ బలపడింది. కెనడా కొత్త నిబంధనలు అంగీకరించకపోతే ఆ దేశంలో తయారయ్యే కార్లపై ట్రంప్ టారిఫ్‌లను విధించే అవకాశముంది.
అమెరికా డాలర్‌తో ఇండియన్ రూపాయి మారవ విలువ మంగళవారం 69.80-70.20 శ్రేణిలో కదలాడవచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది.
You may be interested
షెల్ కంపెనీలపై కఠిన చర్యలు
Tuesday 28th August 2018న్యూఢిల్లీ: షెల్ కంపెనీలను, నల్లధనాన్ని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర కమిటీ పలు సిఫారసులు చేసింది. కంపెనీల చట్టం, 2013 పరిధికి సంబంధించి జరుగుతున్న నేరాల నిరోధానికి ప్రస్తుతం ఉన్న విధివిధానాలను సమీక్షించి, తగిన సిఫారసులు చేయడానికి కేంద్రం గత నెల్లో 10 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఐ శ్రీనివాస్ నేతృత్వంలోని ఈ కమిటీ సోమవారం సంబంధిత నివేదికను ఆర్థిక, కార్పొరేట్
మంళవారం వార్తల్లోని షేర్లు
Tuesday 28th August 2018ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు జెట్ ఎయిర్వేస్:- తొలి త్రైమాసికంలో రూ.1323 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం 6.45శాతం పెరిగి రూ.6,015 కోట్లను సాధించింది. ఎబిటా రూ.1,081.4కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా నిధుల సమీకరించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తుంది. జీఎంఆర్ ఇన్ఫ్రా:- తన అనుబంధ సంస్థ జీఎంఆర్ వరోరా ఎనర్జీ ఆర్బీఐ నుంచి ఫిబ్రవరి 12, 2018న