STOCKS

News


రూపీ క్షీణత

Monday 15th October 2018
Markets_main1539578477.png-21146

ఇండియన్‌ రూపాయి సోమవారం మళ్లీ బలహీనపడింది. ఆసియా కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతుండటం, క్రూడ్‌ ధరలు పెరగడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.91 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన శుక్రవారం ముగింపు 73.57తో పోలిస్తే 0.41 శాతం నష్టపోయింది. రూపాయి సోమవారం 73.80 వద్ద ప్రారంభమైంది.  
రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా పెరడగం వల్ల బాండ్‌ ఈల్డ్స్‌ ఫ్లాట్‌గానే ట్రేడవుతున్నాయి. భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.961 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.983 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
సౌదీ విలేకరి అదృశ్యం కావడంతో క్రూడ్‌ ధరలు సోమవారం ఏకంగా 1.3 శాతంమేర పెరిగాయి. సెప్టెంబర్‌లో వినియోగ ధరల సూచీ  (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.77 శాతంగా నమోదయ్యింది. ఆగస్ట్‌లో ఇది 3.69 శాతం. ఇక జూలైలో 6.5 శాతంగా ఉన్న ఐఐపీ ఆగస్ట్‌లో 4.3 శాతానికి తగ్గింది.  
ప్రస్తుత ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 13.6 శాతంమేర క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 4.21 బిలియన్‌ డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 8.19 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఈ ఏడాది మొత్తంగా 2 శాతంమేర లాభపడింది.
ఆసియా ప్రధాన కరెన్సీలు దాదాపుగా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇండోనేసియా రుపియ 0.33 శాతం, తైవాన్‌ డాలర్‌ 0.17 శాతం, దక్షిణ కొరియా ఒన్‌ 0.17 శాతం, ఫిలిప్పిన్స్‌ పెసో 0.14 శాతం, మలేసియా రింగిట్‌ 0.11 శాతం, థాయ్‌ బట్‌ 0.05 శాతం, హాంగ్‌ కాంగ్‌ డాలర్‌ 0.04 శాతం క్షీణించాయి. అయితే జపాన్‌ యెన్‌ మాత్రం 0.12 శాతం పెరిగింది.
ఇతర దేశాల కరెన్సీలతో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు స్థాయి 95.221తో పోలిస్తే 0.12 శాతం పెరుగుదలతో 95.343 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి ధర

Monday 15th October 2018

ఆసియా మార్కెట్లు నష్టాల ట్రేడింగ్ నేపథ్యంలో సోమవారం పసిడి ధర స్వల్పంగా లాభపడింది. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:15ని.కు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 3.40డాలర్లు లాభపడి 1,225.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచదేశాల మధ్య వాణిజ్యయుద్దం కొనసాగుతుండం, వడ్డీరేట్ల పెంపుపై యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సానుకూల ధోరణితో  ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు బ్రెగ్జిట్‌ ఆందోళనలు, యూరో పతనంతో డాలర్‌

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 15th October 2018

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఐఎల్&ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌ అండ్‌ కార్పోరేషన్‌:- కంపెనీ డెరెక్టర్‌గా సీఎస్‌ రాజన్‌ను నియమితులయ్యారు. నాట్కో ఫార్మా:- కోపాక్సోన్‌ ఔషధాలపై కంపెనీ ఎలాంటి పేటెంట్‌ రైట్స్‌ లేవని యూఎస్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. నితేశ్‌ ఎస్టేట్స్‌:- తన అనుబంధ సంస్థ నితేశ్ పూణే మాల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోని 100శాతం వాటాను ఏబీఎల్‌ గ్రూప్‌కు విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పీవీఆర్‌:- చెన్నైలోని పీవీఆర్‌ ఐకాన్‌లో 10 మల్టీఫ్లెక్స్‌ స్క్రీన్స్‌లను ప్రారంభించింది. దన్షిక

Most from this category