STOCKS

News


కొత్త కనిష్టానికి రూపీ

Thursday 11th October 2018
Markets_main1539230389.png-21025

ఇండియన్‌ రూపాయి గురువారం మరో కొత్త కనిష్ట స్థాయికి పతనమైంది. గ్లోబల్‌ మార్కెట్‌లో అమ్మకాల సునామీ, ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం 9:07 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 74.42 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ముగింపు 74.22తో పోలిస్తే 0.26 శాతం నష్టపోయింది. రూపాయి గురువారం 74.31 వద్ద ప్రారంభమైంది. ఒకానొక సమయంలో 74.46 స్థాయికి కూడా పతనమైంది. భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.999 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 8.031 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
 



You may be interested

నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 4 శాతం డౌన్‌

Thursday 11th October 2018

గ్లోబల్‌ మార్కెట్లను అనుసరిస్తూ ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల సునామీ పోటెత్తింది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు భారీగా పతనమయ్యాయి. సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఏకంగా 4 శాతానికిపైగా పతనమైంది. దాదాపు మిగతా అన్ని ఇండెక్స్‌లు 2 శాతంమేర నష్టపోయాయి. ఉదయం 9:33 సమయంలో ఏ ఏ ఇండెక్స్‌లే ఏ స్థాయిలో పడిపోయాయో చూస్తే.. ఇండెక్స్‌                పతనం (శాతం) నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌    

భారీ గ్యాప్‌డౌన్‌..

Thursday 11th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం భారీ గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,760 పాయింట్లతో పోలిస్తే ఏకంగా 697 పాయింట్ల నష్టంతో 34,063 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,460 పాయింట్లతో పోలిస్తే ఏకంగా 291 పాయింట్ల నష్టంతో 10,169 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు 2.8 శాతంమేర పతనమయ్యాయి. పతనానికి కారణాలివే.. ► అమెరికా మార్కెట్లు బుధవారం మూడు నెలల కనిష్ట స్థాయికి

Most from this category