STOCKS

News


బలపడిన రూపాయి..

Friday 28th September 2018
Markets_main1538108224.png-20656

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి శుక్రవారం మార్నింగ్‌ ట్రేడింగ్‌లో బలపడింది. పది పైసలు లాభంతో 72.49 వద్ద ప్రారంభమైంది. రూపాయి మునపటి ముగింపు 72.59గా ఉంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం ఫ్లాట్‌గానే ముగిసింది. రూపాయి బుధవారం క్లోజింగ్‌ 72.61గా ఉంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. రూపాయి గత కొన్ని సెషన్లుగా 72.60-73 స్వల్ప రేంజ్‌లో కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. 
కాగా అమెరికా డాలర్‌-రూపాయి మారక విలువ శుక్రవారం 72.40-73.05 శ్రేణిలో కదలాడవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది.    



You may be interested

రూ.875 కోట్లు సమీకరించనున్న  జేఎమ్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌ సొల్యూషన్స్‌

Friday 28th September 2018

ముంబై: జేఎమ్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌ సొల్యూషన్స్‌ సంస్థ, రూ.875 కోట్ల నిధులు సమీకరించనున్నది. జేఎమ్‌ ఫైనాన్షియల్‌ గ్రూప్‌, విక్రమ్‌ పండిట్‌, సింగపూర్‌ జీఐసీ ఫండ్‌, కాలిఫోర్నియా యూనివర్శిటీ ఎండోమెంట్‌ ఫండ్‌లకు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని జేఎమ్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌ సొల్యూషన్స్‌ వెల్లడించింది. ఈక్విటీ ద్వారా నిధుల సమీకరణ ప్రాతిపదికన  ఈ ఎన్‌బీఎఫ్‌సీ విలువ రూ.7,175 కోట్లుగా ఉంటుందని అంచనా. కాగా ఈ కంపెనీ ఈ ఏడాది

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 28th September 2018

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు కిర్లోస్కర్‌ ఇండస్ట్రీస్‌:- పారిశ్రామిక ప్రయోజనాల నిమిత్తం 675 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కించుకుంది. డీబీ రియల్టీ:- నీల్‌కమల్‌ రియల్టీ టవర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మొత్తం వాటాను కొనుగోలు చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు:- ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.5431 కోట్ల నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌:- షేర్ల

Most from this category