STOCKS

News


విదేశీ మార్కెట్‌లో 73 దిగువకు రూపాయి

Tuesday 2nd October 2018
Markets_main1538456201.png-20787

  • 73.35 స్థాయికి తగ్గుదల

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి మంగళవారం విదేశీ మార్కెట్‌లో నిట్టనిలువునా క్రాష్‌ అయ్యింది. 73 మార్క్‌ దిగువకు పడిపోయింది. ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయిలకు పతనమైంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 10:13 సమయంలో 73.35 వద్ద ట్రేడవుతోంది. ఒకానొక సమయంలో 73.77 స్థాయికి కూడా పతనమైంది. క్రూడ్‌ ధరలు అమాంతం ఎగయడం, అమెరికా డాలర్‌ బలపడటం వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. కాగా రూపాయి సోమవారం 43 పైసల నష్టంతో 72.91 వద్ద ముగిసింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు వచ్చే నెల 4న ఉంచి అమల్లోకి రానుండటం వల్ల బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు ఇప్పటికే నాలుగేళ్ల గరిష్ట స్థాయిని తాకాయి. అయితే మంగళవారం బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 85 మార్క్‌ను అధిగమించింది. 85.06 వద్ద ట్రేడవుతోంది. ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ కూడా 0.05 శాతం పెరుగుదలతో 94.97 వద్ద ఉంది. కాగా మహాత్మా గాంధీ జయంతి కారణంగా మంగళవారం భారత్‌లో ఫారెక్స్‌ మార్కెట్‌కు సెలవు. 



You may be interested

ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అప్‌..

Tuesday 2nd October 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ సోమవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, విప్రో ఏడీఆర్‌లు పెరిగాయి. అదేసమయంలో వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు తగ్గాయి. వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పడిపోయింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగింది.    టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 1.37 శాతం పెరుగుదలతో 15.57 డాలర్లకు ఎగసింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌

స్వల్పంగా కోలుకున్న పసిడి

Tuesday 2nd October 2018

గతరాత్రి అమెరికా మార్కెట్లో 6-వారాల కనిష్టానికి పతనమైన పసిడి ధర బుధవారం ఆసియా మార్కెట్లో  కోలుకుంది. డాలర్‌ స్థిరమైన ర్యాలీ అందుకు కారణమవుతోంది. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 3.60 డాలర్లు లాభపడి 1,195.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి నెలరోజ గరిష్టాన్ని(95.37) తాకిన డాలర్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 94.94 స్థాయిని వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నాఫ్టా(నార్త్‌ అమెరికన్‌

Most from this category