STOCKS

News


రూపీ, బాండ్స్‌ అప్‌.. కారణం ఇదేనా?

Tuesday 11th December 2018
Markets_main1544523434.png-22828

ప్రారంభంలో నిట్టనిలువునా పతనమైన ఇండియన్‌ రూపాయి తర్వాత మళ్లీ రీబౌండ్‌ అయ్యింది. బాండ్స్‌ కూడా అంతే. కొత్తగా వచ్చే ఆర్‌బీఐ గవర్నర్‌ అనుసరించే పాలసీ విధానాలపై సానుకూల అంచనాలు ఇందుకు కారణం. కాగా ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మార్కెట్‌ వర్గాల్లో వడ్డీ రేట్లు తగ్గించొచ్చని, లిక్విడిటీకి సంబంధించి సరళమైన విధానాలు ఉండొచ్చని, బ్యాంకింగ్‌ నిబంధనలను సరళీకరించొచ్చని అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈక్విటీలు, కరెన్సీ, బాండ్‌ మార్కెట్లు రికవరీ అయ్యాయి. 

పాలసీ రేట్లు దిగువకు!!
ట్రేడింగ్‌ ప్రారంభంలోనే భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.7 శాతానికి పెరిగాయి. తర్వాత 7.5 శాతానికి తగ్గాయి. ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా నేపథ్యంలో నెలకొన్న ఆందోళనల వల్ల సాధారణంగా అయితే బాండ్‌ ఈల్డ్స్‌ పెరగాలి. అయితే ఈల్డ్స్‌ సోమవారం ముగింపు స్థాయి దిగువకు పడిపోవడం గమనార్హం. కొత్త గవర్నర్‌ వడ్డీ రేట్లు విషయంలో సరళంగా ఉండొచ్చని మనీ మార్కెట్‌ సీనియర్‌ ట్రేడర్‌ ఒకరు తెలిపారు. ద్రవ్యోల్బణం తక్కువగా స్థాయిల్లో ఉండటం వల్ల మానిటరీ పాలసీ సరళంగా ఉండటానికి అవకాశముందని పేర్కొన్నారు. కాగా గత ఆర్‌బీఐ పాలసీ సమావేశంలో పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ట్రేడింగ్‌ ప్రారంభంలో గవర్నమెంట్‌ బాండ్లను విరివిగా కొనుగోలు చేశాయని మరొక ట్రేడరు తెలిపారు.  

రూపీ రికవరీ
ప్రారంభంలో బాగా పడిపోయిన రూపాయి తర్వాత వెంటనే కోలుకుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 72.44 స్థాయికి తగ్గిన రూపాయి.. తర్వాత మళ్లీ 72 మార్క్‌ పైకి వచ్చేసింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో రూపాయిలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయని, తర్వాత ప్రభుత్వ బ్యాంకులు డాలర్లను విక్రయించడంతో రూపాయి రికవరీ అయ్యిందని మార్కెట్‌ ట్రేడర్‌ తెలిపారు. ఎన్నికల ఫలితాలు తేటతెల్లమవ్వడం, క్రూడ్‌ ధరలు తక్కువగా ఉండటం కూడా సానుకూల అంశమని పేర్కొన్నారు. 

ఎన్‌పీఏ నిబంధనల సరళీకరణ?
ఈక్విటీ మార్కెట్ల విషయానికి వస్తే.. బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ సంస్థల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. గత తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకూడదంటే బ్యాంకులకు కఠిన నిబంధనలు అవసరమని ఉర్జిత్‌ పటేల్‌ భావించారు. అందువల ఈయన నేతృత్వంలోని ఆర్‌బీఐ.. మొండి బకాయిల పరిష్కారానికి ఫిబ్రవరి 12న సత్వర దిద్దుబాటు నిబంధనలను తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 12 నాటి సర్కులర్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అంచనా వేయడం కష్టతరమని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ తెలిపారు. డిసెంబర్‌ 14న ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అయితే ఇప్పుడు ఈ సమావేశం ప్రణాళిక ప్రకారం జరుగుతుందా? లేక వాయిదా పడుతుందా? చూడాల్సి ఉంది. You may be interested

నష్టాల్లోంచి... లాభాల ముగింపు

Tuesday 11th December 2018

ఆదుకున్న ఐటీ, ఫార్మా షేర్ల ర్యాలీ 781 పాయింట్ల రేంజ్‌ కదలాడిన సెన్సెక్స్‌ ఐటీ, ఫార్మా, ప్రభుత్వ రంగ షేర్ల ర్యాలీ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ముగిసింది. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలుబడున్న నేపథ్యంతో పాటు, డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత, ఆర్‌బీఐ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా ఉదంత భయాలతో సూచీలు భారీ గ్యాప్‌ డౌన్‌తో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మిడ్‌సెషన్‌ సమయానికి కల్లా కొనుగోళ్ల అండతో సూచీలు నష్టాలను పూడ్చుకోవడంతో

రికవరీ సూచించిన బ్యాంకు నిఫ్టీ ఆప్షన్లు

Tuesday 11th December 2018

దేశీయ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో రోజువారీ కనిష్ఠస్థాయి నుంచి కోలుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్ల మద్దతు సూచీలను ఆదుకొంది. ఉర్జిత్‌పటేల్‌ రాజీనామాను, ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మంచి ర్యాలీ జరిపాయి. దీంతో మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. సూచీల్లో ఇంత షార్‌‍్ప రికవరీ ఆశ్చర్యకరంగా కనిపించినా బ్యాంకు నిఫ్టీ ఆప్షన్లు పరిశీలిస్తే కారణం తెలిసిపోతుంది. మంగళవారం ట్రేడింగ్‌లో బ్యాంకు నిఫ్టీ 25598 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి

Most from this category