STOCKS

News


రూపాయి రయ్‌.. రయ్‌..

Thursday 9th August 2018
Markets_main1533788954.png-19061

  • 68.47 వద్ద ప్రారంభం
  • బుధవారం ముగింపు 68.63తో పోలిస్తే 0.24 శాతం అప్‌

ఇండియన్‌ రూపాయి గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే బలపడింది. రిజర్వు బ్యాంక్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రభుత్వానికి రూ.50,000 కోట్ల డివిడెంట్‌ అందిస్తామని ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణం. దీనివల్ల ప్రభుత్వానికి నిధులు సమకూరి, ద్రవ్యలోటు కొంత తగ్గుతుంది. క్రూడ్‌ అయిల్‌ ధరలు తగ్గడం, మార్కెట్లు సానుకూలముగా ఉండటం వంటి అంశాలు కూడా సానుకూల ప్రభావం చూపాయి. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 68.47 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 68.63తో పోలిస్తే 0.24 శాతం పెరిగింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 68.47 వద్ద ప్రారంభమైంది. 68.46 గరిష్ట స్థాయిని కూడా తాకింది. 
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.752 శాతంగా ఉంది. బుధవారం నాటి ముగింపు స్థాయి 7.781 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి.
బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ గురువారం మార్నింగ్‌ సెషన్‌లో 117 పాయింట్ల లాభంతో 38,005 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. జనవరి నుంచి చూస్తే దాదాపు ఇండెక్స్‌ దాదాపు 10.6 శాతంమేర లాభపడింది.
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 6.7 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 394 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 5.51 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 16 బిలియన్‌ డాలర్ల విలువైన ప్రొడక్టులపై ఆగస్ట్‌ 23 నుంచి  అదనంగా 25 శాతం టారిఫ్‌లను విధిస్తామని చైనా ప్రకటించింది. దీని కన్నా ముందు అమెరికా కూడా చైనా నుంచి దిగుమతి చేసుకునే ప్రొడక్టులపై టారిఫ్‌లను విధిస్తామని హెచ్చరించింది.   



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Thursday 9th August 2018

అమెరికా - చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ మరింత ముదరడంతో పసిడి ధర బలపడుతోంది. అమెరికా ప్రారంభించిన ట్రేడ్‌వార్‌పై ఈసారి చైనా గట్టిగా ప్రతిఘటించింది. ఆగస్ట్‌ 23 నుంచి అమెరికా నుంచి దిగుమతయ్యే 16 బిలియన్‌ డాలర్ల కోట్ల విలువైన ఇంధన, ఉక్కు ఉ‍త్పత్తులతో పాటు, అటో, వైద్య పరికరాలపై 25 శాతం టారిఫ్‌ టారీఫ్‌లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇదే ఆగస్ట్‌ 23 నుంచి 16 బిలియన్‌ డాలర్ల విలువైన

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 9th August 2018

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు సేలన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌:- ప్రతి షేరు ధర రూ.415.50ల వద్ద డాలీ ఖన్నా 1.50లక్షల ఈక్విటీ షేర్లును కోనుగోలు చేశారు. సన్‌టెక్స్‌ రియల్టీ:- ప్రతి షేరు ధర రూ.415.50ల వద్ద డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సం‍స్థ 10లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. వింధ్యా టెలిలింక్‌:- ఈక్విటీస్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతి షేరు ధర రూ.1,333.28ల వద్ద మొత్తం

Most from this category