STOCKS

News


రూపాయి పతనాన్ని అడ్డుకుంటాం..

Thursday 13th September 2018
Markets_main1536813749.png-20219

న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 'అసంబద్ధ స్థాయి'కి పడిపోకుండా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ అన్ని చర్యలు తీసుకుంటాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ స్పష్టం చేశారు. రూపాయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయులకు పతనం కావడం వెనుక హేతుబద్ధత లేదని, మార్కెట్ ఆపరేటర్ల ఓవర్‌రియాక్షన్‌ను ఇది ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ఈ మేరకు ఆయన పోస్ట్ చేశారు. ముడిచమురు ధరలు పెరుగుతుండటం, విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం తదితర అంశాల నడుమ రూపాయి క్షీణత కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. రూపాయి మారకం విలువ బుధవారం మరో కొత్త ఆల్‌టైమ్ కనిష్టం 72.91 స్థాయికి పడిపోయిన నేపథ్యంలో గర్గ్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఎండీగా విభ పదాల్కర్

Thursday 13th September 2018

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా విభ పదాల్కర్‌ నియమితులయ్యారు. సెప్టెంబర్‌ 8న అమితాబ్ చౌదరి ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ప్రస్తుతం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ), ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విభ పదాల్కర్‌ను నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బుధవారం విధులు చేపట్టిన ఆమె పదవీకాలం మూడేళ్లు ఉంటుందని వెల్లడించింది.   

జీఎస్టీ ఎగవేతలపై ఇక ముమ్మర చర్యలు

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతలను నిరోధించేందుకు సోదాలు, స్వాధీనాలతో పాటు అరెస్ట్‌లు తదితర అంశాలను చూసేందుకు జీఎస్టీ కమిషనర్‌ (ఇన్వెస్టిగేషన్‌) కార్యాలయాన్ని కేంద్ర రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. తొలి కమిషనర్‌గా నీరజ్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. వ్యాపారులు కొత్త పన్ను చట్టానికి మళ్లేందుకు, అలవాటు పడేందుకు కొంత కాలం చూసీ, చూడనట్టు వ్యవహరించిన కేంద్రం ఇప్పుడు తీవ్ర చర్యలకు రంగం సిద్ధం చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది దాటిపోవడం, పన్ను

Most from this category