STOCKS

News


రూపాయిపై పరిమిత ప్రభావమే

Monday 17th September 2018
Markets_main1537159418.png-20311

ముంబై: రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యల సానుకూల ప్రభావం పరిమిత స్థాయిలోనే ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక నివేదికలో పేర్కొంది. రూపాయిని స్థిరీకరించే ఉద్దేశంతో స్వల్పకాలిక విదేశీ రుణాలు సమీకరించుకోవడానికి కంపెనీలకు ప్రతిపాదించిన వెసులుబాటును .. వాస్తవానికి ఇన్వెస్టర్లు దీర్ఘకాలికంగా ప్రతికూలాంశంగానే పరిగణించే అవకాశం ఉందని తెలిపింది. ఇది కంపెనీల రిస్క్‌ ప్రొఫైల్‌ను మరింతగా దిగజార్చవచ్చని పేర్కొంది. రూపాయి, ఆర్థిక అంశాలపై సమీక్ష నిర్వహించిన కేంద్రం .. తయారీ సంస్థలు 50 మిలియన్ డాలర్ల దాకా విదేశీ రుణాలు (ఈసీబీ) ఏడాది వ్యవధికి కూడా తీసుకునేందుకు అనుమతించాలని భావించింది. అలాగే, ఏదైనా గ్రూప్‌.. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించే రుణాలపై పరిమితిని తొలగించడంతో పాటు మసాలా బాండ్ల జారీపై విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌ నుంచి మినహాయింపులివ్వడం మొదలైన చర్యలు పరిశీలించింది. ఈ చర్యలతో విదేశీ మారక పొదుపు లేదా విదేశీ నిధుల రాక రూపంలో కనీసం 8-10 బిలియన్ డాలర్ల మేర సానుకూల ప్రభావం కనిపించగలదని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. 
    వర్ధమాన దేశాల మార్కెట్లపై ప్రపంచ మార్కెట్‌ సెంటిమెంట్ మెరుగ్గా ఉంటే .. ప్రభుత్వం ప్రకటించిన చర్యలతో కార్పొరేట్లు విదేశీ రుణాలను సులువుగా పొందే అవకాశాలు ఉండేవని, సానుకూల ఫలితాలు రావొచ్చని నివేదికలో వివరించింది. మరోవైపు, రూపాయి స్థిరత్వంపైనే మసాలా బాండ్లకు డిమాండ్ ఉంటుందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూపాయి మారకంలో ఉండే ఈ బాండ్లను మరింతగా కొనుగోలు చేయడానికి విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవచ్చని పేర్కొంది. సమస్య పరిష్కారానికి ప్రతిపాదించిన స్వల్పకాలిక చర్యల్లో ఏమాత్రం రక్షణాత్మక ధోరణులు కనిపించినా.. సంస్కరణల అమల్లో ప్రభుత్వం తిరోగమన బాట పట్టిందని ఇన్వెస్టర్లలో భావన కలగవచ్చని, ఇది కూడా అత్యం‍త సమీప భవిష్యత్‌లో రూపాయికి ప్రతికూలం కావొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వివరించింది.



You may be interested

 రూపాయి, ముడిచమురు ధరలే కీలకం

Monday 17th September 2018

జారుడు బల్లపై ప్రయాణం చేస్తున్న రూపాయి దిశను మార్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం ప్రకటించిన పలు అంశాల ప్రభావం సోమవారం మార్కెట్‌ కదలికలలో స్పష్టంగా కనిపించనుందని మార్కెట్‌ పండితులు భావిస్తున్నారు. కరెంట్‌ ఖాతా లోటు అదుపులో ఉంచడం, విదేశీ నిధుల ప్రవాహం గణనీయంగా పెరిగేలా చూడడంలో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన అంశాలు ఈవారంలో మార్కెట్‌కు నడిపించనున్నాయని డెల్టా గ్లోబల్‌ పాట్నర్స్‌ ప్రిన్సిపల్‌

చైనాపై సుంకాలవైపే ట్రంప్ మొగ్గు!!

Monday 17th September 2018

వాషింగ్టన్‌: చైనాతో ప్రతిపాదిత చర్చల ఫలితాలు ఎలా ఉన్నా ఆ దేశం నుంచి మరిన్ని దిగుమతులపై సుంకాలు విధించాలన్న నిర్ణయాన్ని అమలు చేసేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నారు.  దాదాపు 200 బిలియన్ డాలర్ల దిగుమతులపై కొత్తగా టారిఫ్‌లను అమలు చేసే విషయంలో ట్రంప్ ముందుకే వెళ్లనున్నట్లు ది వాల్‌ స్ట్రీట్ జర్నల్ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ టారీఫ్‌ల అమలు సోమవారం నుంచే ప్రారంభంకావొచ్చని

Most from this category