STOCKS

News


రూపాయి కోసం ఆర్‌బీఐతో కేంద్రం సంప్రదింపులు

Tuesday 11th September 2018
Markets_main1536642758.png-20159

న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి అదే పనిగా పడిపోతుండడంతో కేంద్రం తన వంతు ప్రయత్నాలు ఆరంభించింది. ఆర్‌బీఐ జోక్యం ద్వారా రూపాయి క్షీణతకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్టు ఓ అధికారి తెలిపారు. కేంద్రం సూచనల ఫలితమేమో కానీ, ఆర్‌బీఐ ఇప్పటికే రంగంలోకి దిగి డాలర్ల అమ్మకాలు మొదలు పెట్టింది. దీంతో విదేశీ మారకం నిల్వలు ఆగస్ట్‌ చివరికి 400.10 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్టు ఆర్‌బీఐ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఆర్‌బీఐ వద్ద తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, సమయానుకూలంగా మార్కెట్‌ జోక్యం కోసం సంప్రదింపులు కొనసాగుతాయని ఆ అధికారి చెప్పారు. రూపాయి పతనం వాస్తవికంగా లేదంటూ, పౌండ్‌, యూరో, యువాన్‌, యెన్‌లతో బలపడిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ఆందోళనకరమైన పరిస్థితేమీ లేదు. చాలా వరకు అంతర్జాతీయ కరెన్సీలు డాలర్‌ బలం కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నవే. అయితే, రూపాయి మాత్రం పలు ఇతర కరెన్సీలతో బలపడింది’’ అని ఆ అధికారి వివరించారు. 



You may be interested

జేపీ అసోసియేట్స్‌పై దివాలా పిటీషన్‌ !

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: జైప్రకాశ్‌ అసోసియేట్స్‌కు వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ దివాలా పిటీషన్‌ దాఖలు చేసింది. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)అలహాబాద్‌ బెంచ్‌లో ఈ దివాలా పిటీషన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌ దాఖలు చేసింది. దివాలా  నోటీసును మూడు రోజుల్లో జేపీ అసోసియేట్స్‌కు పంపించాలని ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఎన్‌సీఎల్‌టీ అలహబాద్‌ బెంచ్‌ ఆదేశించింది. మరోవైపు ఈ నెల 17లోపు దీనికి సమాధానం ఇవ్వాలని జేపీ అసోసియేట్స్‌ను కూడా ఆదేశించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ అభ్యర్థనను మన్నించి

ఎస్సార్‌ స్టీల్ కొనుగోలుకు  ఆర్సెలర్‌ మిట్టల్ తాజా బిడ్‌

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: భారీ రుణాల్లో కూరుకుపోయిన ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు ఆర్సెలర్‌ మిట్టల్‌ సోమవారం ఉదయం తాజా బిడ్‌ దాఖలు చేసింది. జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్‌ అండ్‌ సుమిటోమో మెటల్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో ఈ బిడ్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. బిడ్‌ విలువ ఎంతన్నది అధికారికంగా తెలియనప్పటికీ, ఈ మొత్తం రూ.42,000 కోట్లు ఉండవచ్చని వినిపిస్తోంది. ఎస్సార్‌ స్టీల్‌ రుణ దాతలకు తిరిగి చెల్లింపులు చేయటానికి ఆర్సెలర్‌ మిట్టల్‌ ఈ

Most from this category