STOCKS

News


పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

Saturday 13th April 2019
Markets_main1555135197.png-25108

- 413.8 బిలియన్‌ డాలర్లకు చేరిక

ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్‌ రిజర్వ్స్‌) వరుసగా రెండో వారంలోనూ పెరిగాయి. జీవితకాల గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్‌ 5తో ముగిసిన వారంలో 1.87 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 413.8 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. ఈ కాలంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) పెర‌గ‌డ‌మే ఇందుకు కారణమని ఆర్‌బీఐ వెల్లడించింది. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగమైన ఎఫ్‌సీఏలు 2.1 బిలియన్‌ డాలర్లు పెరిగి 386.1 బిలియన్‌ డాలర్లకి చేరాయి. (అమెరికా డాలర్‌ మినహాయించి మిగిలిన కరెన్సీలైన యూరో, పౌండ్‌, యెన్ వంటి ఇతర నిల్వల పెరుగుదల/తరుగుదలను డాలర్లలోనికి మార్చి లెక్కిండాన్నే ఎఫ్‌సీఏగా వ్యవహరిస్తారు.) బంగారం నిల్వలు 182.6 మిలియన్‌ డాలర్లు తగ్గి 23.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయంగా ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) వద్ద ఉన్నటువంటి స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ విలువ 1.2 మిలియన్‌ డాలర్లు స్వల్పంగా తగ్గి 1.455 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఫండ్‌తో నిల్వల స్థితి 2.5 మిలియన్‌ డాలర్లు క్షీణించి 2.983 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.  ఇక అంతకుముందు వారంలో డాలర్-రూపాయి స్వాప్ నిర్వహించడం వల్ల 5.2 బిలియన్‌ డాలర్ల పెరిగి 411.9 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు తెలిపింది. దేశ విదేశీ మారక నిల్వలు గతేడాది ఏప్రిల్ 13న 426.028 బిలియన్‌ డాలర్లకు చేరి జీవితకాల గరిష్ట స్థాయిని నమోదుచేసిన సంగతి తెలిసిందే.



You may be interested

ఎస్సార్‌ స్టీల్‌ కేసులో సుప్రీం సంచలన నిర్ణయం

Saturday 13th April 2019

చెల్లింపులు ఆపమని ఆర్సెలార్‌కు ఆదేశాలు ఎస్సార్‌ స్టీల​ దివాలా కేసులో యథాతధ స్థితిని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ కొనుగోలుకు ఆర్సెలార్‌ మిట్టల్‌ చెల్లించాల్సిన రూ. 42 వేల కోట్లను నిలిపివేయాలని తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని అభ్యర్ధనలను తొందరగా పరిశీలించి అంతిమ నిర్ణయాన్ని తీసుకోవాలని అప్పిలేట్‌ ట్రిబ్యున్‌లను ఆదేశించింది. అంతవరకు ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు ఉద్దేశించిన మొత్తాన్ని కంపెనీ రుణదాతలకు చెల్లించకుండా నిలిపివేయాలని సుప్రీంకోర్టు

వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయా?

Saturday 13th April 2019

- ఆ దిశగానే సంకేతాలిస్తున్న గణాంకాలు - దారుణంగా పడిన పారిశ్రామిక వృద్ధి - ఫిబ్రవరిలో 0.1 శాతానికే పరిమితం - ఇది 20 నెలల కనిష్టస్థాయి - మార్చిలో 2.57 శాతం న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు అటు ‍కేంద్రం, ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తూ, శుక్రవారం తాజా ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ద్వారా పరిశీలించే ఈ రంగం వృద్ధి

Most from this category