STOCKS

News


స్వల్పంగా పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

Saturday 1st September 2018
Markets_main1535797306.png-19882

ముంబై:- దేశీయ విదేశీ మారక నిల్వలు ఆగస్టు 24తో ముగిసిన వారాంతానికి 445.4 మిలియన్ డాలర్లు పెరిగి 401.293 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకు ముందువారం ఆగస్టు 17తో ముగిసిన వారాంతానికి 33.2 మిలియన్ డాలర్ల మేరతగ్గి 400.847 బిలియన్ డాలర్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. బంగారం నిల్వలు 35.7 మిలియన్ డాలర్లు పెరిగి 20.763 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కాగా ఐఎంఎఫ్ వద్ద నిల్వలు కూడా 8.6 మిలియన్ డాలర్లు పెరిగి 1.471 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దీనికి తోడు ఐఎంఎఫ్ డ్రాయింగ్ రిజర్వ్‌లు కూడా 14.5 మిలియన్ డాలర్లు పెరిగి 2.467 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.



You may be interested

టాటామోటర్స్‌.. ఆశించిన స్థాయిలో అమ్మకాలు

Saturday 1st September 2018

టాటామోటర్స్‌ ఆగస్ట్‌లో ఆశించిన స్థాయిలో వాహన విక్రయాలను జరిపింది. ఈ నెలలో మొత్తం 58,262 వాహనాలను విక్రయించింది.  గతేడాది ఇదే నెలలో జరిపిన మొత్తం 45,906 వాహన అమ్మకాలతో పోలిస్తే ఇది27 శాతం అధికం. వాణిజ‍్య వాహన విభాగంలో 39,859 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గతేడాదితో ఇదే డిసెంబర్‌ 31,566 అమ్మకాలతో పోలిస్తే ఇది 26శాతం ఎక్కువ. పాసింజర్‌ వాహన విభాగంలో గతేడాది విక్రయాలతో పోలిస్తే 28శాతం వృద్ధిని సాధించి

మారుతీ స్పీడ్‌ తగ్గింది..

Saturday 1st September 2018

దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా జోరు తగ్గింది. ఆగస్ట్‌ నెలలో కంపెనీ విక్రయాలు 3.4 శాతం మేర క్షీణించాయి. 1,58,189 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో మారుతీ సుజుకీ వాహన అమ్మకాలు 1,63,701 యూనిట్లుగా ఉన్నాయి. కేరళ వరదలు, ఇతర ప్రాంతాల్లో భారీ వర్షలు ప్రతికూల ప్రభావం చూపాయని కంపెనీ పేర్కొంది.  మారుతీ సుజుకీ దేశీ వాహన విక్రయాలు ఆగస్ట్‌లో 2.8 శాతం క్షీణతతో

Most from this category