STOCKS

News


భారత ఫారెక్స్‌ నిల్వలు యట్‌ 393 బిలియన్‌ డాలర్లు

Saturday 5th January 2019
Markets_main1546685502.png-23432

ముంబై: భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు డిసెంబర్‌ 28తో ముగిసిన వారంలో 116.4 మిలియన్‌ డాలర్లు ఎగశాయి. దీనితో నిల్వలు మొత్తం విలువ 393.40 బిలియన్‌ డాలర్లకు చేరింది. విలువను డాలర్‌ రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ (యూరో, పౌండ్‌, యన్‌ వంటివి) అసెట్స్‌ పెరగడం దీనికి ప్రధాన కారణమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. 2018 ఏప్రిల్‌ 13న రికార్డు స్థాయి 426.028 బిలియన్‌ డాలర్లకు చేరిన విదేశీ మారకనిల్వలు అటు తర్వాత క్రమంగా తగ్గాయి. తాజాగా విడుదలైన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే...
- ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌: మొత్తం నిల్వల్లో ప్రధాన భాగమైన ఈ విభాగం పరిమాణం 106.30 మిలియన్‌ డాలర్లు పెరిగి 368.077 బిలియన్‌ డాలర్లకు చేరింది.
-  పసిడి నిల్వల విలువ స్థిరంగా 21.224 బిలియన్‌ డాలర్లుగా ఉంది.
- అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ పరిమాణం 3.6 మిలియన్‌ డాలర్లు పెరిగి 1.462 బిలియన్లకు చేరింది.
- ఇక ఐఎంఎఫ్‌కు సంబంధించిన దేశీ నగదు నిల్వలు కూడా 6.5 మిలియన్‌ డాలర్లు పెరిగి 2.640 బిలియన్‌ డాలర్లకు ఎగసింది.



You may be interested

మెడికల్‌ ఉత్పత్తుల అడ్డా ‘‘ఆర్కే’’

Saturday 5th January 2019

ఏటా రూ.6 కోట్ల వ్యాపారం ఈ ఏడాది లక్ష్యం రూ.20 కోట్లు స్టార్డప్‌ డైరీతో ఫౌండర్‌ రవికిరణ్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్కానింగ్, ఈసీజీ వంటి వైద్య ఉత్పత్తులను సమీకరించుకోవటం కార్పొరేట్‌ ఆసుపత్రులకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, గ్రామాల్లోని ఆసుపత్రులకు కాస్త ఇబ్బందే. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది ఆర్కే ఎంటర్‌ప్రైజెస్‌. బహుళ జాతి కంపెనీలతో ఒప్పందం చేసుకొని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మెడికల్‌ ఉత్తత్తులను విక్రయించడమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు

రూ. 150 కోట్ల డాలర్లు సమీకరించనున్న ఐఓసీ

Saturday 5th January 2019

ముంబై: దేశీయ అతి పెద్ద ఆయిల్‌ మార్కెటింగ్‌, రిఫైనింగ్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) అంతర్జాతీయ బాండ్‌ మార్కెట్‌ నుంచి 150 కోట్ల డాలర్ల మేర నిధులు సమీకరించనుంది. ఈ కంపెనీ అమెరికా డాలర్‌ డినామినేషన్‌ నోట్ల ద్వారా 75 కోట్ల డాలర్ల నుంచి 150 కోట్ల డాలర్ల మేర నిధులు సమీకరించనున్నదని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ బాండ్ల కాలపరిమితి వెల్లడి కాలేదు. అయితే ఈ బాండ్లకు

Most from this category