STOCKS

News


రూపాయి ఎలా కదలొచ్చు

Monday 1st October 2018
Markets_main1538370054.png-20729

♦రూపాయి శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 11 పైసలు లాభంతో 72.59 వద్ద ముగిసింది. రూపాయికి 72.95 కీలక నిరోధ స్థాయి అని, 72.04, 71.40 కీలక మద్దతు స్థాయిలని జియోజిత్‌ పేర్కొంది. 

♦ఎఫ్‌బీఐఎల్‌.. డాలర్‌కు రెఫరెన్స్‌ రేటును 72.54గా, యూరోకు రెఫరెన్స్‌ రేటును 84.44గా నిర్ణయించింది. 

♦సెప్టెంబర్‌ 21తో ముగిసిన వారంలో దేశీ ఫారెక్స్‌ నిల్వలు 1.3 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 401.79 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 

♦దేశీ మ్యానుఫ్యాక్చరింగ్‌ పీఎంఐ డేటా సోమవారం విడుదల కానుంది. నికాయ్‌ సర్వీసెస్‌ పీఎంఐ గణాంకాలు మంగళవారం వెలువడతాయి. 

♦మహాత్మా గాంధీ జయంతి కారణంగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లకు మంగళవారం సెలవు. 

♦రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మానిటరీ పాలసీ సమావేశం ఈ వారంలో జరగనుంది.

♦ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి అంచనాలు, ఫెడ్‌ క్రమానుగత రేట్ల పెంపు ప్రణాళికల నేపథ్యంలో అమెరికా డాలర్‌ లాభాల్లో ట్రేడవుతోంది. 

♦ఇటలీ అధిక బడ్జెట్‌ లోటుతో ముందుకెళ్లాలని భావిస్తోంది. దీంతో యూరో పతనమైంది. యూకే పౌండు పెరిగింది.

♦జపాన్‌ యెన్‌ కదలికలు మాత్రం సెంట్రల్‌ బ్యాంకులు చర్యలు, వాణిజ్య ఉద్రిక్తతలపై ఆధారపడనుంది.  

♦ గోల్డెన్‌ వీక్‌ హాలిడే కారణంగా చైనా మార్కెట్లు సెలవు.



You may be interested

పరుగెట్టే స్టాక్స్‌ను ముందే పట్టుకునే ఫండ్‌

Monday 1st October 2018

ఇన్వెస్కో ఇండియా క్రాంటా ఫండ్‌ స్మాల్‌, మిడ్‌క్యాప్‌ విభాగంలో భారీగా పెరిగి, అధిక విలువలకు చేరిన స్టాక్స్‌... ఇటీవలి కరెక్షన్‌లో భారీగా పడడాన్ని చూసే ఉంటాం. వీటిల్లో ఆణిముత్యాలను పట్టుకుని ఇన్వెస్టింగ్‌ చేయడమే వ్యాల్యూ ఫండ్స్‌ చేసే పని. బాగా పడిన స్టాక్స్‌ లేదా, అధిక విలువ కలిగి, తక్కువ ధరల వద్ద ట్రేడవుతున్నవి, దీర్ఘకాల వృద్ధికి అవకాశాలు బలంగా ఉన్నవి పెట్టుబడులకు మంచి అవకాశాలు అవుతాయి. ఇన్వెస్కో ఇండియా కాంట్రా

పసిడికి డాలర్‌ ఎఫెక్ట్‌

Monday 1st October 2018

డాలర్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా సోమవారం పసిడి ధర తగ్గుముఖం పట్టింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 4డాలర్లు మేర నష్టపోయింది. ఫెడ్‌రిజర్వ్‌బ్యాంకు కీలక వడ్డీరేట్లను 2020 వరకు పలు విడతల్లో పెంచాలని  ప్రణాళికలు రూపోందించింది. ఫలితంగా డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో గతవారం ట్రేడింగ్‌ చివరిరోజైన శుక్రవారం 3వారాల గరిష్టానికి చేరుకుంది. నేడు 94.84 వద్ద స్థిరమైన ర్యాలీ చేస్తుంది.  భారత వర్తమాన కాలం

Most from this category