STOCKS

News


రూపాయికి జంట దెబ్బలు!

Wednesday 12th December 2018
Markets_main1544593741.png-22858

నీరుకారుతున్న రికవరీ ఆశలు
ఈ ఏడాది ఆసియాలో అత్యంత అధ్వాన్న కరెన్సీగా పేరు మూటగట్టుకొన్న రూపాయి కష్టాలు మళ్లీ మొదలయినట్లున్నాయి. ఇటీవల కాలంలో కాస్త రికవరీ చూపుతున్న రూపాయి తాజాగా మరోమారు పతనం దిశగా పరుగులు పెడుతోంది. దీంతో రూపీ రికవరీ ఆశలను బుల్స్‌ వదులకోకతప్పదని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా జరిగిన రెండు సంఘటనలు రూపాయికి జంట కష్టాలు తెచ్చాయని విశ్లేషిస్తున్నారు. ఒకపక్క అధికార బీజేపీ మూడు ప్రధార రాష్ట్రాల్లో ఓడిపోవడం, మరోపక్క ఆర్‌బీఐకి ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయడం రూపీకి రుచించేవికావు. ఈ రెండు పరిణామాలతో రూపీ మరోమారు నేలచూపులు చూడడం ఆరంభించింది. దీంతో ఈ ఏడాది ఇంతవరకు రూపాయి 11 శాతం క్షీణించినట్లైంది. రూపాయి కష్టాలు మరింతగా కొనసాగుతాయని మిజుహో బ్యాంక్‌ అంచనా వేస్తోంది. ఉర్జిత్‌ రాజీనామాతో ఆర్‌బీఐ స్వీయప్రతిపత్తిపై విదేశీ మదుపరులకు సందేహాలు మొదలవుతాయని తెలిపింది. అందువల్ల మరోమారు రూపాయి 73 స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. ఈ స్థాయిని నిలబెట్టుకోలేకుంటే క్రమంగా 74ను సైతం రూపాయి తాకవచ్చని ప్రముఖ కరెన్సీట్రేడర్‌ మసకట్సుఫుకాయా చెప్పారు. ఆర్‌బీఐకి కొత్త గవర్నర్‌ను నియమించినా, ఆయన పనితీరు పరీక్షించేవరకు ఇన్వెస్టర్లు ఆందోళనగానే ఉంటారన్నారు. దీంతో పాటు బీజేపీ మూడు రాష్ట్రాల్లో అపజయం సాధించడంతో విధాన నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంచనాల్లో ఉంటారన్నారు. 


జనాకర్షక పథకాలతో విత్త ముప్పు
తాజా ఎదురుదెబ్బతో కొత్త సంస్కరణలకు బీజేపీ వెనుకాడవచ్చని, జనాకర్షక పథకాలవైపునకు మరలవచ్చని వెస్ట్‌ప్యాక్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ ప్రతినిధి ఫ్రాన్సిస్‌ ఛెంగ్‌ చెప్పారు. ఇదే జరిగితే దేశీయ విత్త లోటు విస్తృతమవుతుందని హెచ్చరించారు. ఈ అనుమానాలకు ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ మానిటరీ పాలసీలో మార్పులకు యత్నిస్తే రూపాయి కోలుకోలేనంతగా బలహీనపడుతుందన్నారు. బోఫాఎంఎల్‌సైతం రూపాయిలో స్వల్పకాలిక క్షీణతను అంచనా వేస్తోంది. చమురు ధరలు బాటమ్‌ అవుట్‌ కావడం కూడా రూపాయిని కలవరపెడుతోందని బోఫాఎంఎల్‌ ప్రతినిధి ఆదర్శ్‌ సిన్హా చెప్పారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకు రూపాయికి గడ్డుకాలమేనన్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నందున రాబోయే ఎంపీసీ సమావేశంలో రేట్‌కట్‌ ఉండొచ్చని అంచనా వేశారు. 

 You may be interested

బ్యాంక్‌ షేర్లకు ‘‘శక్తి’’

Wednesday 12th December 2018

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త ఛైర్మన్‌గా శక్తికాంత్‌ నియామకం బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ఉత్సాహానిచ్చింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకు ఇండెక్స్‌లు బుధవారం 1.50శాతం లాభపడ్డాయి. యస్‌బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ 4శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 3శాతం పెరిగాయి. సౌతిండియా, కోటక్‌ బ్యాంక్ షేర్లు 2శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం ర్యాలీ

రూ.160 కోట్లు సమీకరించిన హీరో ఎలక్ట్రిక్‌

Wednesday 12th December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ తాజాగా రూ.160 కోట్ల నిధులను సమీకరించింది. ముంబైకి చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అల్ఫా క్యాపిటల్‌ అడ్వైజరీ ఈ పెట్టుబడులు పెట్టిందని.. దీంతో హీరో ఎలక్ట్రిక్‌లో కొంత వాటా ఈ సంస్థకు దక్కుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త ఉత్పత్తులు, రీసెర్చ్, టెక్నాలజీ మీద ఈ నిధులను వెచ్చిస్తామని హీరో ఎలక్ట్రిక్‌

Most from this category