STOCKS

News


కుప్పకూలనున్న క్రిప్టోకరెన్సీ?!

Wednesday 10th October 2018
Markets_main1539166966.png-21021

అనలిస్టుల హెచ్చరిక
క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ కుప్పకూలే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని ఎకనమిస్టులు, జునిపెర్‌ రిసెర్చ్‌ తదితర సంస్థలు హెచ్చరిస్తున్నాయి. క్రిప్టోల్లో దిగ్గజంగా చెప్పుకునే బిట్‌ కాయిన్‌ డైలీ లావాదేవీ వాల్యూంలు(డీటీవీ) ఏడాది సరాసరి కన్నా కనిష్ఠాలకు పడిపోవడం ప్రమాదఘంటికని చెబుతున్నారు. 2017లో బిట్‌కాయిన్‌ సరాసరి డీటీవీలు 3.6 లక్షలుండగా, 2018 సెప్టెంబర్‌నాటికి 2.3 లక్షలకు పడిపోయాయి. అదే విధంగా డైలీ లావాదేవీ విలువ గతేడాది 370 కోట్ల డాలర్లుండగా, ఈ ఏడాది 67 కోట్లకు పతనమయ్యాయని జునిపెర్‌ రిసెర్చ్‌ తెలిపింది. మొత్తం క్రిప్టో కరెన్సీ ప్రపంచమే కుదేలుకానుందని సంస్థ తాజాగా విడుదల చేసిన ‘ ఫ్యూచర్‌ ఆఫ్‌ క్రిప్టోకరెన్సీ: బిట్‌కాయిన్‌, ఆల్ట్‌కాయిన్‌ ట్రెండ్స్‌ అండ్‌ ఛాలెంజెస్‌ 2018-2023’ నివేదిక వెల్లడించింది.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 1.4 లక్షల కోట్ల డాలర్ల క్రిప్టో లావాదేవీలు నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో వీటి విలువ 1.7 లక్షల కోట్ల డాలర్లుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో వీటి విలువ అత్యంత దారుణంగా 35500 కోట్ల డాలర్లకు దిగజారిందని నివేదిక తెలిపింది. క్యు3లో వీటి విలువ మరో 47 శాతం పతనం కావచ్చని అంచనా వేసింది. సాంప్రదాయక విత్త వ్యవస్థలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాధారణంగా క్రిప్టోకరెన్సీల్లాంటి ప్రత్యామ్నాయాల వాడకం పెరుగుతుంటుంది. అలాంటిది చైనా యూఎస్‌ వాణిజ్యయుద్ధం, బ్రెక్సిట్‌ కష్టాల్లాంటి పలు అవకాశాలు వచ్చినా క్రిప్టోల్లో ర్యాలీ రాలేదని, దీన్ని బట్టి క్రిప్టోకరెన్సీలకు అత్యంత గడ్డుకాలం రానుందని భావించవచ్చని తెలిపింది. 



You may be interested

ఎట్టకేలకు రిలీఫ్‌ర్యాలీ

Wednesday 10th October 2018

10460 స్థాయిని అందుకున్ననిఫ్టీ సెన్సెక్స్‌ 461 పాయింట్ల లాభం మార్కెట్‌ను నడిపించిన బ్యాంకింగ్‌, అటో రంగ షేర్లు ముంబై:- ఎట్టకేలకు మార్కెట్‌లో రిలీఫ్‌ర్యాలీ జరిగింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బేర్స్‌ షార్ట్‌ కవరింగ్‌ ఫలితంగా సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు ఆరునెలల కనిష్టస్థాయి నుంచి కోలుకున్నాయి. రెండో త్రైమాసిక ఫలితాలపై మార్కెట్‌ ఆశావహన అంచనాలు కూడా మార్కెట్‌ ర్యాలీకి కారణమైంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ, అటో రంగ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ 482

ఎర్నింగ్స్‌ సీజన్‌ ఎలా ఉండొచ్చు?!

Wednesday 10th October 2018

రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనాలు క్యు2లో ఐటీ, కన్జూమర్‌గూడ్స్‌ రంగాల కంపెనీలు బలమైన ఎర్నింగ్స్‌ నమోదు చేస్తాయని, ఆటో, ఫార్మా, సిమెంట్‌ రంగాల కంపెనీలు ఒత్తిళ్లను ఎదుర్కొంటాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. విద్యుత్‌ రంగ కంపెనీల ఫలితాలు ఫ్లాట్‌గా ఉండొచ్చని తెలిపింది. నిర్మాణ రంగంలో కంపెనీల ఆదాయాలు పెరిగినా ఎర్నింగ్స్‌ మందకొడిగానే ఉండొచ్చని తెలిపింది. వివిధ రంగాలపై బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయాలు.. ఐటీ, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ గూడ్స్‌: రూపాయి క్షీణత ఐటీ కంపెనీలకు కలిసిరావచ్చు.

Most from this category