STOCKS

News


ఈ 3 ఆయిల్‌ రంగ షేర్లలో ర్యాలీ..!

Thursday 12th July 2018
Markets_main1531389022.png-18246

ముంబై: ఎర్నింగ్స్‌ వృద్ధి పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికవరీ చోటుచేసుకుంటుందని, క్యూ1 ఫలితాలు బలంగా ఉండనున్నాయని ఎమ్‌ఓఎస్‌ఎల్‌ (రీటైల్) రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖేమ్కా అన్నారు. అతి తక్కువ బేస్‌ ఇయర్‌ అయినందున తొలి త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉంటాయని భావిస్తున్నట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వస్తు సేవల పన్ను అమలు ప్రభావం అనేక రంగాలపై ఉండగా.. ఇవన్నీ గతేడాదిలో వెనుకబడి ఉన్నాయని, ఇప్పుడు మంచి పనితీరును కనబరుస్తున్నట్లు వివరించారు. ఐటీ, హెల్త్‌కేర్‌ ర్యాలీలో ఉండగా.. ఐటీ విభాగంలో టీసీఎస్‌ నికర లాభం రెండంకెల వృద్ధి రేటును నమోదుచేసి.. ఈ ఏడాదిలో ఇదే జోరును కొనసాగిస్తుందనే సంకేతం సైతం ఇచ్చిందన్నారు. టెలికం రంగానికి విషయానికి వస్తే.. రిలయన్స్‌ జియో ధరల పరంగా, టెక్నాలజీ పరంగానూ పరిశ్రమలో అంతరాయం కలుగజేసిందని వాఖ్యానించిన ఆయన మరోసారి కూడా ఈ రంగం నష్టాలనే ప్రకటింస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఐడియా, వొడాఫోన్‌ విలీనం తరువాత ఈ రంగంలో ఇంకాస్త స్థిరత్వం మిగిలే ఉందని.. అప్పటి వరకు ప్రతికూలంగానే ఉండే అవకాశం ఉన్నట్లు వివరించారు. ఫోర్టీస్‌ షేరు కేవలం అత్యధిక రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లకు మాత్రమే తగిన షేరని వ్యాఖ్యానించిన ఆయన.. తొలుత ఈ కంపెనీ బిడ్డర్లు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు కేవలం ఐహెచ్‌హెచ్‌ మాత్రమే ఉందని అన్నారు. భూగోళ రాజకీయ సమస్యల కారణంగా ముడిచమురు ధరలు ప్రభావితం కానునట్లు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఆకర్షణీయంగా ఉన్నట్లు తెలిపారు. అధిక క్రూడ్‌ ధరల వల్ల ఈ రంగ షేర్లలో కరెక్షన్‌ నమోదైనప్పటికీ.. నిర్మాణాత్మకంగా బలంగా ఉన్నట్లు విశ్లేషించారు. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లు క్యూ1లో 40-44 శాతం వరకు ఆరోగ్యకర ఎర్నింగ్స్‌ వృద్ధిరేటును ప్రకటించవచ్చని అంచనావేశారు. గతేడాదిలోని తక్కువ బేస్‌ ఇప్పుడు ప్రయోజకరంగా ఉంటుందన్నారు. గడిచిన రెండేళ్లలో నికర లాభంలో చక్రగతి వృద్ధి రేటు కేవలం 3 శాతంగానే ఉందన్నారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల ఎర్నింగ్స్‌ ఆకర్షణీయంగా ఉంటుందన్న ఆయన ఇండియన్‌ ఆయిల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ షేర్లు తమ టాప్‌ పిక్స్‌గా సూచించారు. You may be interested

ఆల్‌టైమ్‌ హై సరే.. ఈ అంశాలతో జాగ్రత్త...

Thursday 12th July 2018

దేశీయ సూచీలు రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నాయి. తాజాగా సెన్సెక్స్‌ రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సూచీల జోరుకు పగ్గాలు వేసే ఐదు రిస్కు అంశాలను జాగ్రత్తగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.. 1. క్రూడాయిల్‌ ధర పెరుగుదల, రూపాయి క్షీణత: చాలా రోజుల తర్వాత క్రూడాయిల్‌ ధర ఇటీవలే బ్యారెల్‌ 80 డాలర్లను తాకింది. అయితే అక్కడ నిలదొక్కుకోలేక ప్రస్తుతం 73-74 డాలర్ల రేంజ్‌లో కదలాడుతోంది. ఇకమీదట క్రూడ్‌ ధర

పతనమైన చమురు: పెట్రో షేర్లకు రెక్కలు

Thursday 12th July 2018

ముంబై:- ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు దిగి రావడంతో దేశీయంగా గురువారం ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లు హావా కొనసాగుతోంది. ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న బీఎస్‌ఈలోని ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ నేడు 2.62శాతం లాభపడింది. ఇంట్రాడేలో 14295 పాయింట్ల గరిష్టాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం గం.2:00లకు సమయానికి ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచి 2శాతం

Most from this category