STOCKS

News


రూపాయి విలువ 72 స్థాయికి తగ్గొచ్చు..!

Tuesday 10th July 2018
Markets_main1531206249.png-18164

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అడ్డుకున్నప్పటికీ.. ఇది కేవలం తాత్కాలిక చర్యగానే ఉండనుందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. పలు భారత కంపెనీలు విదేశాల నుంచి తీసుకున్న స్వల్పకాలిక రుణాల తిరిగి చెల్లింపులకు సమయం దగ్గర పడుతుండడం, మండుతున్న ముడిచమురు ధరల కారణంగా మారకం విలువ మరంత కనిష్టస్థాయిలకు పడిపోయే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. రూపాయి విలువను నిలబెట్టడంలో భాగంగా ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఫారెక్స్‌ నిల్వలు సైతం హరించుకుపోతున్నట్లు వెల్లడించారు. గడిచిన రెండు నెలలకాలంలో ఆర్బీఐ 20 బిలియన్‌ డాలర్ల మేర ఫారెక్స్‌ నిల్వలను అమ్మివేయగా.. ఇంతకుముందు గరిష్టస్థాయిలను నమోదుచేసిన నిల్వలు ఇప్పుడు కరిగిపోయాయని వ్యాఖ్యానించారు. మరో 20 బిలియన్‌ డాలర్లను ఫారెక్స్‌ మార్కెట్‌లో అమ్మేందుకు ప్రయత్నాలు సైతం కొనసాగుతున్నట్లు తెలిపారు. దేశీయ స్వల్పకాలిక అప్పు 222 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా.. ఇది ఫారెక్స్‌ నిల్వలలో ఏకంగా సగం మొత్తానికి సమానంగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ఇదంతా కూడా పశ్చిమ దేశాలలో ఉన్నటువంటి అతితక్కువ వడ్డీ ప్రయోజనాన్ని పొందడంలో భాగంగా జరిగిన అప్పుగా నిపుణులు చెబుతున్నారు. ఇందులో కొంతభాగం హెడ్జింగ్‌ నిమిత్తం కేటాయించగా.. మరికొన్ని సంస్థలు ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని చెల్లింపుల కోసం కేటాయించినట్లు తెలిపిన నిపుణులు.. వీటిలో చాలా కంపెనీలు, వ్యక్తులు కరెన్సీ విలువ తక్కువగా ఉన్నప్పుడే ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల లాభదాయకత మొత్తం ఈసారి ఆవిరైపోతుందని వివరించారు. దేశీ కంపెనీలు చేసిన స్వల్పకాలిక అప్పులు తిరిగి చెల్లించాల్సిరావడం అనే ప్రధాన ఒత్తిడికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) ప్రవాహం బాగా తగ్గిపోవడం.. ఇక ఇదే సమయంలో ముడిచమురు ధరలు మండిపోవడం లాంటి ప్రతికూల వాతావరణంలో రూపాయి మారకం విలువ మరింత క్షీణతను నమోదుచేస్తుందంటున్న వీరు, వచ్చే త్రైమాసికాలలో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 72 చేరుకుంటుందని అంచనావేస్తున్నారు. 

పెరుగుతున్న క్రూడ్‌ ధరలు.. ఈ ప్రభావం కారణంగా జీడీపీలో కరెంట్‌ ఖాతా లోటు 2.6 శాతానికి చేరుతుందన్న అంచనా ఆధారంగా ఈ ఏడాది చివరినాటికి రూపాయి మారకం విలువ 72 వద్దకు చేరుతుందని అంచనావేస్తున్నట్లు బార్‌క్లేస్‌ చీఫ్‌ ఇండియా ఎకనామిస్ట్‌ సిద్ధార్థ సన్యాల్ వెల్లడించారు. కరెంట్‌ అకౌంట్‌ లోటు అంశం ఆధారంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి మారకం విలువ 70 తాకేందుకు అవకాశం ఎక్కువగా ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ అంచనావేసింది.

అమెరికా వడ్డీ రేట్లు పెంచిన కారణంగా అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల కరెన్సీల విలువలు క్షీణతను నమోదుచేస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగిన దగ్గర నుంచి లివరేజ్డ్‌ ఫండ్లు ఎమర్జింగ్‌ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండగా.. ఈ నిధుల ప్రవాహాన్ని తగ్గించడంలో భాగంగా టర్కీ, ఇండోనేషియాలతో పాటు భారత్‌ కూడా వడ్డీ రేట్లను పెంచినట్లు ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి విదేశీ పోర్టిఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) మళ్లీ గాడిలో పడకపోతే 65 బిలియన్‌ డాలర్ల కరెంట్‌ అకౌంట్‌ లోటు నిమిత్తం ఆర్బీఐ మరో 20 బిలియన్‌ డాలర్లను అమ్మక తప్పదని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ ఇంద్రనీల్ సేన్‌గుప్త అన్నారు.You may be interested

బైబ్యాక్‌ ప్రణాళికతో హెచ్‌సీఎల్‌ హల్‌చల్‌..!

Tuesday 10th July 2018

ముంబై:- షేర్ల బైబ్యాక్ అంశం తెరపైకి రావడంతో ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. జూలై 12న జరిగే కంపెనీ బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ అంశంపై చర్చిస్తున్నట్లు హెచ్‌సీఎల్‌ సోమవారం స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. షేర్ల బైబ్యాక్ అంశం వెలుగులోకి రావడంతో నేటి మార్కెట్‌ ప్రారంభంలోనే హెచ్‌సీఎల్‌ షేర్లు 4శాతం లాభంతో రూ.1000.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మధ్యాహ్నం గం.12:15ని.లకు

సాంక్టమ్‌ వెల్త్‌ నుంచి వాల్యూ రికమండేషన్లు

Tuesday 10th July 2018

వచ్చే ఒకటిరెండు నెలల్లో దాదాపు 16 శాతం వరకు రాబడినిచ్చే ఐదు వాల్యూ స్టాకులను సాంక్టమ్‌వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రికమండ్‌ చేసింది.. 1. యస్‌బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 410. స్టాప్‌లాస్‌ రూ. 348. గత సంవత్సరకాలంగా రూ. 285- 380 మధ్య కన్సాలిడేషన్‌ చెందింది. ఇటీవలే వీక్లీ చార్టుల్లో ఇన్వర్టెడ్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ పాటర్న్‌ను ఏర్పరిచింది. ఇది బుల్లిష్‌నెస్‌కు సంకేతం. ఎంఏసీడీ సైతం పాజిటివ్‌ క్రాసోవర్‌ఏర్పరిచింది. బోలింగర్‌ బ్యాండ్‌ విస్తరించడంతో

Most from this category