STOCKS

News


27వేల ఎగువకు బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 12th July 2018
Markets_main1531375151.png-18240

  • ఇంట్రాడేలో 350 పాయింట్ల లాభం

ముంబై:- సూచీలు సరికొత్త రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌​పరుగులు పెడుతోంది. నిఫ్టీ బ్యాంకు గురువారం 26,937  వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఈ సూచీలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు 2నుంచి 1శాతం ర్యాలీ అండతో ఇంట్రాడేలో 27000 మార్కును అధిగమించింది. అదే ఊపుతో 350 పాయింట్లు లాభపడి లాభపడి 27,164 ఇంట్రాడే గరిష్టానికి నమోదు చేసింది. ఉదయం గం.11:00లకు నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ గత ముగింపు(26,936)తో పోలిస్తే 324 పాయింట్లు లాభపడి 27,140 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలోని బ్యాంక్‌ బరోడా, యస్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఎస్‌బీఐ షేర్లు 3 నుంచి 2శాతం లాభపడ్డాయి. యాక్సిక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 1శాతం లాభపడ్డాయి. ఆర్‌బీఎల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంకులు అరశాతం లాభపడ్డాయి.



You may be interested

ఈపీఎస్‌ వృద్ధి ఉన్న 15 షేర్లు..!

Thursday 12th July 2018

నిఫ్టీ 50లోని 15 షేర్లలో 40 శాతం ఈపీఎస్‌ వృద్ధి అంచనా ముంబై: అంచనాలను మించిన లాభాలతో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్‌ను ప్రారంభించింది. గడిచిన మూడేళ్లపాటు ఫ్లాట్‌ ఎర్నింగ్స్‌ వృద్ధిరేటును కనబరిచిన ఈ ఐటీ దిగ్గజం.. మెరుగైన ఆర్థిక ఫలితాలతో కొత్త ఆర్థిక సంవత్సరంలోనికి అడుగుపెడుతునట్లు ప్రకటించింది. క్యూ1లో ఈ సంస్థ నికర లాభం 23 శాతం వృద్ధి చెందిన

ఇన్ఫీ ఫలితాలపై అంచనాలేంటి?

Thursday 12th July 2018

దేశీయ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించనుంది. ఇప్పటికే తోటి సంస్థ టీసీఎస్‌ అదరగొట్టే ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫీ ఫలితాలపై వివిధ బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు, అంచనాలు ఇలా ఉన్నాయి... - ఫిలిప్‌ క్యాపిటల్‌: గతంలో ప్రకటించిన 6-8 శాతం రెవెన్యూ గ్రోత్‌ గైడెన్స్‌ను కొనసాగిస్తుంది. డీల్స్‌ వరద కారణంగా అవుట్‌లుక్‌

Most from this category