STOCKS

News


ఐదు రంగాలు... ఏడు షేర్లు

Thursday 10th January 2019
Markets_main1547115374.png-23511

ఎలారా క్యాపిటల్‌ సిఫార్సులు
వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలు నిఫ్టీ ఎర్నింగ్స్‌లో 20 శాతం చక్రీయ వార్షిక వృద్ది ఉండొచ్చని ఎలారా క్యాపిటల్‌ రిసెర్చ్‌ హెడ్‌ రవిసుందర్‌ ముత్తుకృష్ణన్‌ చెప్పారు. ఇకమీదట ఎకానమీ బలపడుతుందన్నారు. దీర్ఘకాలిక ధృక్పథంలో పెట్టుబడులు పెట్టాలని, ప్రతి పతనంలో కొంత చొప్పున పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు. సంవత్సరకాలానికి మంచి జోరు చూపించే ఐదు రంగాలను, వాటిలో ఏడు స్టాకులను ఆయన సిఫార్సు చేశారు.
1. బ్యాంక్స్‌: రిటైల్‌, సర్వీస్‌ రంగాల్లో వృద్ది కొనసాగుతోంది. కార్పొరేట్‌ క్రెడిట్‌కు సంబంధించి సంవత్సర ద్వితీయార్ధంలో మెరుగుదల ఉండొచ్చు. స్టాక్స్‌: ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.
2. ఇన్‌ఫ్రా: ప్రాజెక్టులు పూర్తయి అమల్లోకి రావడం వేగవంతమవుతోంది. ఎగ్జిక్యూషన్‌లో ముందున్న కంపెనీలు లాభపడతాయి. స్టాక్‌: పీఎన్‌సీ ఇన్‌ఫ్రా
3. క్యాపిటల్‌ గూడ్స్‌: సరఫరా వ్యవస్థలు బాగుండి, ఆర్డర్‌ బుక్‌ బలంగా ఉన్న కంపెనీలకు మంచి కాలం కలిసిరానుంది. స్టాక్‌: కేఈసీ ఇంటర్నేషనల్‌.
4. కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: వ్యయాలు తగ్గడం, విస్తరించేందుకు భారీ మార్కెట్‌ ఉండడం, జీఎస్‌టీ కారణంగా లాభం కలిగనుంది. స్టాక్‌: క్రాంప్టన్‌
5. ఆటో: క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం, కొత్త ఉత్పత్తుల లాంచింగ్‌తో కంపెనీలకు కలిసిరానుంది. స్టాక్స్‌: హీరో మోటో కార్‌‍్ప, మారుతి. 



You may be interested

విదేశీ పెట్టుబడులు తిరిగొస్తాయి: ఆదిత్య బిర్లాసన్‌లైఫ్‌ ఏఎంసీ

Friday 11th January 2019

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2018లో ప్రతికూలంగా ఉండడాన్ని చూశాం. డాలర్‌ బలంగా ఉండడం, అమెరికాలో రాబడులు పెరగడం దీనికి ప్రధాన కారణాలు. 2018లో భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిన ఎఫ్‌పీఐలు... ఈ ఏడాది తిరిగి పెట్టుబడులతో మన మార్కెట్లలోకి వస్తారని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ అంచనా వేస్తోంది. 2019లో వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ ఆగి, తిరిగి పెట్టుబడులు

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌

Thursday 10th January 2019

నాలుగు రోజుల ర్యాలీకి గురువారం బ్రేక్‌ పడింది. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలకు తోడు డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. చివరికి సెన్సెక్స్‌ 106 పాయింట్లు నష్టపోయి 36,106 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 10,821 వద్ద ముగిసాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరగ్గా అటో, ఫార్మా షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలోని

Most from this category